వీళ్లు మామూలు దొంగలు కాదు, లాయర్ వ్యూహం: 107 కేసులు, అడ్డొస్తే హత్య

విజయవాడ: బెజవాడ పోలీసులు నలుగురు ఘరానా దొంగలను అరెస్టు చేశారు. వారు ఏకంగా 107 కేసుల్లో నిందితులు. గొలుసు దొంగతనం చేస్తారు. అటు ఇటు అయితే హత్య చేసేందుకు కూడా వెనుకాడరు. వీరి పదమూడేళ్ల క్రితం రెండు హత్య కేసుల్లో నిందితులని పోలీసులు గుర్తించారు.

సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గొలుసు దొంగతనాలతో నేర చరిత్ర ప్రారంభించి, కొన్నాళ్లుగా వరుస గొలుసు దొంగతనాలతో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ను గడగడలాడిస్తున్న ఆ ముఠాను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

విచారణలో నిందితులు 2003లో రెండు హత్య కేసుల్లో నిందితులుగా గుర్తించారు. 2004లో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఒక బ్యాంకును దోచుకునే ప్రయత్నంలో బ్యాంకు మేనేజర్‌పై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది.

వీరి నుంచి మొత్తం 107 గొలుసు దొంగతనాలకు సంబంధించి రూ.50లక్షలు విలువ చేసే 1.40కిలో బంగారు నగలు, నేరాలకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ పోలీస్‌ కమిషనర్‌ హరికుమార్‌ వెల్లడించారు.

చైన్ స్నాచింగ్‌లు, హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడిన ఈ ముఠాలో ఓ న్యాయవాది కూడా ఉన్నాడు. ఈ న్యాయవాదే ముఠాకు కీలక వ్యక్తిగా మారి నేరాలకు వ్యూహరచన చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

సింగారువేలు రామచంద్రన్ అలియాస్ శిరివెళ్ళ రాము, అలియాస్ జోసఫ్ (44) కారు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన పాగోల రాము అలియాస్ బుజ్జి అనే వ్యక్తి ద్వారా రామచంద్రన్‌కు బంకూరి వెంకట శివనాగరాజు (38)తో పరిచయం ఏర్పడింది.

Four thieves in Bejawada arrested

రామచంద్రన్, శివనాగరాజులు ఇద్దరూ నేరస్వభావం కలిగిన వారు కావడంతో మంచి స్నేహితులయ్యారు. శివనాగరాజు గతంలో సిద్ధార్థ లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివాడు. 2004లో న్యాయవాదిగా బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఎన్‌రోల్ అయ్యాడు.

ఇతనిపై 2001 నుంచి 2004 వరకు పటమట, మాచవరం, పెనమలూరు, ఉయ్యూరు తదితర పాంతాల్లో సుమారు ఎనిమిది నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో చోరీ బంగారాన్ని వంగర రామచంద్రరావు (రిసీవర్)కు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు.

ఇదిలావుండగా స్నేహితులైన వెంకట శివ నాగరాజు, రామచంద్రన్ ఇద్దరూ ప్రతిరోజూ వన్‌టౌన్ ఇందాద్‌ఘర్ సమీపంలోని మద్యం షాపునకు వచ్చేవారు. ఇక్కడ వీరిద్దరికీ సైకిల్ స్టాండులో పని చేసే శ్రీనివాసరావు అలియాస్ కొండపల్లి శ్రీను (38) తలారి రామబహదూర్, అలియాస్ బహదూర్ (32), పెండెం నరేష్‌బాబు అలియాస్ నరేష్ (32)లతో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో రామచంద్రన్, న్యాయవాది శివనాగరాజు, కుడిపూడి శ్రీనివాస రావులు కలిసి, విడివిడిగా 2000 నుంచి 2004 వరకు నగరంలోని పలు పోలీస్టేషన్ల పరిధిలో 13 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2003లో ఒరిస్సా వెళ్లి 50వేలకు ఓ తుపాకీ, 6తూటాలు కొనుగోలు చేశారు.

కారు చోరీ చేయాలనే ఉద్దేశంతో 2003 మే 15 రాత్రి విజయవాడ - ఉయ్యూరు వెళ్లే మార్గంలో కంకిపాడు సమీపంలో మారుతీ కారు నడుపుకుంటూ వస్తున్న చింతా వెంకట చలపతిరావు అనే వ్యక్తిపై కాల్పులు జరపగా అతను మృతి చెందాడు.

ఇదే సమయంలో కారు చెట్టుకు ఢీకొని ధ్వంసం కావడంతో వదిలేసి పరారయ్యారు. ఈ క్రమంలో న్యాయవాది శివనాగరాజు తాను 50వేలు బాకీ పడిన నరేంద్ర రెడ్డి అనే వ్యక్తికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఆపై కారులో గొంతుకు తాడు బిగించి చంపి రాజమండ్రి వద్ద గోదావరి నదిలోకి పడేశారు.

నిందితులు 2004 మే 17న గుంటూరు జిల్లా కాజా గ్రామంలో ఓ బ్యాంకులోకి కత్తి, తుపాకీలతో ప్రవేశించి కాల్పులు జరిపి దోపిడీయత్నం చేశారు. నిందితులపై కొత్తపేటలో ఒకటి, సూర్యారావుపేటలో 5, సత్యనారాయణపురంలో 10, కృష్ణలంకలో రెండు, మాచవరంలో 21, పటమటలో 34, నున్నలో 2, పెనమలూరులో 8, అజిత్‌సింగ్‌నగర్‌లో 2, ఉయ్యూరు టౌన్ పరిధిలో 3, గన్నవరంలో 4, పమిడిముక్కలలో 2, భవానీపురంలో 12, ఇబ్రహీంపట్నంలో 1, మొత్తం 107 స్నాచింగ్‌లు, 2001 నుంచి 2016వరకు నమోదయ్యాయి.

కాగా రిసీవర్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేయగా, నేరాలతో సంబంధం ఉన్న రామబహదూర్, పెండెం నరేష్‌లు పరారీలో ఉన్నారని జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+