హోం నుండి పారిపోయిన యువతులు, కొడుకుతో సహా..

ఒక యువతి తన మూడేళ్ల కొడుకుతో సహా పారిపోయిందని తెలుస్తోంది. రక్షణ ఏర్పాట్లు పకడ్బందీగానే ఉన్నాయని, వాటిని ఛేదించుకొని వారు పారిపోయారని ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్లు
బంజారాహిల్స్‌లోని ఓ టిఫిన్ సెంటర్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్ పూర్తిగా కాలిపోయింది. రోడ్డు నెంబర్ వన్‌లోని నాలుగు చక్రాల బండిపై ఈ ఘటన జరిగింది.
దొంగనోట్ల కలకలం
సికింద్రాబాదులోని మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆరు లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ నకిలీ నోట్లు పాకిస్తాన్‌లో ముద్రించినట్లు అనుమానిస్తున్నారు. నకిలీ నోట్లతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications