బోరుబావిలో చిన్నారి: రోదనలతో విషాదం (పిక్చర్స్)
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయింది. 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి గిరిజను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన మల్గ నాగయ్య తన పొలంలో కొన్ని నెలల క్రితం వేసిన బోరుబావిలో నీరు పడకపోవడంతో కేసింగ్ తీసి గోతిని పూడ్చివేయకుండా అలాగే వదిలేశాడు. ఆదివారం మల్గ ఎల్లమ్మ తన మనుమరాలు గిరిజ(5), మనుమడు చెర్రి(7)లను వెంటతీసుకుని వ్యవసాయ పొలానికి వచ్చి పత్తిచేనులో ఉన్న చెట్టుకింద చిన్నారులను కూర్చోబెట్టి తోటి మహిళలతో కలిసి పత్తితీసే పనిలో నిమగ్నమైంది.
ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో గిరిజ తన అన్నతో ఆడుతూ పత్తిచేను మధ్యలోకి నడిచి వెళుతూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. గిరిజ అన్న చెర్రి విషయం చెప్పడంతో, వారి మేనమామ శ్రీ శైలం అధికారులకు సమాచారం అందించారు.

బోరుబావిలో చిన్నారి...
తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి బోరు బావిలో పడిన చిన్నారిని తీయడానికి చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు.

బోరుబావిలో పడిన చిన్నారి
చిన్నారిని రక్షించడానికి అధికారులు హుటాహుటిన 108 ఆంబులెన్సును రప్పించి బోరు బావిలోకి ప్రాణవాయువును పంపే ఏర్పాట్లు చేశారు.

బోరుబావిలో పడిన చిన్నారి
బోరుబావిలో పాప 35-40 ఫీట్ల లోతులో ఉన్నట్లు నిర్ధారించి జేసీబీల సాయంతో బోరుబావి పక్కనే సమాంతరంగా గోతిని తవ్వడం ప్రారంభించారు.

బోరుబావిలో పడిన చిన్నారి
వైద్య, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలంలోనే ఉన్నాయి. లోతుకు వెళ్లేకొద్ది భూమి గట్టి పడుతుండడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. దీంతో సాయంత్రం 7 గంటల వరకు కేవలం 20 అడుగుల లోతు గోతిని మాత్రమే తవ్వగలిగారు.

బోరుబావిలో పడిన చిన్నారి
సమాంతర గొయ్యి తవ్వకాన్ని కొనసాగిస్తూ పాపను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

బోరుబావిలో పడిన చిన్నారి
పాప బోరు బావిలో 35-40 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించిన అధికారులు అదే స్థాయి వరకు భూగర్భ జలాలు బోరుబావిలో ఉన్నట్లు బావిస్తున్నారు.

బోరుబావిలో పడిన చిన్నారి
బోరు బావిలో నీరు ఉండడం వల్ల చిన్నారి బతికుండే పరిస్థితి కనబడడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బోరుబావిలో పడిన చిన్నారి
వ్యవసాయ బోరుబావిలో చిన్నారి పడిన ఘటన సమాచారం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలు సంఘటనా స్థలాన్ని సందర్చించారు.

బోరుబావిలో పడిన చిన్నారి
ఆదివారం రాత్రంతా కూడా సహాయక చర్యలు చేపట్టినా బాలిక జాడ కనిపించలేదు. సోమవారం ఉదయం బోరు బావికి సమాంతరంగా 40 అడుగుల లోతు వరకు గోయి తవ్వారు.

బోరుబావిలో పడిన చిన్నారి
ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కూడా బాలికను వెలికి తీసేందుకు రంగంలోకి దిగాయి. విక్టిమ్ లోకేషన్ పరికరాన్ని వాడినా ఫలితం కనిపించలేదు.

బోరు బావిలో పడిన చిన్నారి
బోరుబావిలో పడిన తన కూతురును తలుచుకుని తల్లి బోరుబోరున విలపిస్తోంది. ఆమె రోదనలకు ఇతరులు తల్లడిల్లిపోయారు.

బోరుబావిలో పడిన చిన్నారి
బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ పేరు మీద ఆధార్ కార్డు కూడా వచ్చింది. ఆ ఆధార్ కార్డు ఇదే.

బోరు బావిలో పడిన చిన్నారి
బోరు బావిలో పడిన చిన్నారి గిరిజ కుటుంబ సభ్యులు ఇలా విషాద వదనాలతో.. పాపం పుణ్యం తెలియని గిరజ కోసం నిరీక్షిస్తూ...

బోరుబావిలో పడిన చిన్నారి
బోరుబావిలో పడిన తన చిన్నారి కూతురు గిరిజను తలుచుకుని తల్లి బోరు బోరున విలపిస్తోంది. ఆమెను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.

బోరుబావిలో పడిన చిన్నారి
గిరిజ బోరు బావిలో పడిందన్న వార్త గ్రామంలో గుప్పుమంది. దాంతో పెద్ద యెత్తున సంఘటనా స్థలానికి తరలి వచ్చారు.

బోరుబావిలో పడిన చిన్నారి
తనతో ఆడుకుంటూనే బోరు బావిలో పడిన సోదరిని తలుచుకుంటు తండ్రితో చెర్రి ఇలా కనిపించాడు. కళ్ల ముందే సోదరిని బోరు బావి మింగేయడాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు.












Click it and Unblock the Notifications