గుడ్ న్యూస్: ఉచిత బస్సు ప్రయాణీకుల తిప్పలకు చెక్ పెట్టిన చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి వారిలో సంతోషానికి కారణమవుతుంది. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంతో పాటుగా మహిళలకు అనేక పథకాలను అందిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా మహిళలు సంతోషపడే మరో తీపి కబురు చెప్పారు.
కొత్తగా 1500 బస్సులు కొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
కొత్తగా 1500 బస్సులు కొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న క్రమంలో మహిళల కోసం నడుస్తున్న ఉచిత బస్సుల్లో 100% ఆక్యుపెన్సి ఉంటుంది. ఈ క్రమంలో మహిళలకు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండడ కోసం కొత్తగా 1500 బస్సులు కొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు.

1050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి
అనంతపురం జిల్లాలో బస్టాండ్లు, డిపోలను పరిశీలించిన ఆయన త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం సక్సెస్ ఫుల్ గా అమలవుతుందని ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 90% గా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 129 డిపోలు ఉన్నాయని వాటిల్లో 60 డిపోలలో 100% ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుందని ద్వారకా తిరుమలరావు తెలిపారు.
కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఇబ్బంది ఉండదు: ఆర్టీసీ ఎండీ
ఉచిత బస్సు ప్రయాణానికి రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. అంతేకాదు మహిళా ప్రయాణికులతో మాట్లాడి స్త్రీ శక్తి పథకం అమలు తీరును గురించి తెలుసుకున్నారు. ఉచితపస్సు పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.. ఉద్యోగులు జీరో బ్రేక్ డౌన్ రికార్డ్ సాధించాలని ఆయన కోరారు.
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం సక్సెస్
ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ, కర్ణాటక రాష్ట్రంలోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ అది విజయవంతం కాలేదని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాలలో వైఫల్యాలను అధిగమిస్తూ సమర్థవంతంగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్టాండులను మినీ విమానాశ్రయాలుగా ఆధునీకరిస్తామని, ప్రజల ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఆధునీకరణ పనులు చేపడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications