టెక్కీలకు షాక్: 40 లక్షల ఐటీ ఉద్యోగాలకు ముప్పు
ఆటోమెషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే దెబ్బతగిలే అవకాశం ఉంది.డిజిటల్ టెక్నాలజీలోకి మళ్ళే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకొంటూ పోతున్నాయి.
న్యూఢిల్లీ: ఆటోమెషన్ దెబ్బ ఐటీ ఇండస్ట్రీకి భారీగానే దెబ్బతగిలే అవకాశం ఉంది.డిజిటల్ టెక్నాలజీలోకి మళ్ళే క్రమంలో ఇప్పటికే చాలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకొంటూ పోతున్నాయి.
కొత్త నియామకాల జోరు కూడ తగ్గింది. ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఈ విషయమై అెమెరికాకుయ చెందిన బిజినెస్ అడ్వయిజరీ సంస్థ హెచ్ఎప్ఎస్ రీసెర్చ్ అంచనాల ప్రకారం ఆటోమెషన్ ప్రభావంతో దేశీయ ఐటీ వర్క్‌ఫోర్స్ 14 శాతం తగ్గిపోనుందని సమాచారం.

2021 నాటికి నలభై లక్షల మంది ఉద్యోగులు ప్రమాదంలో పడిపోనున్నారు. బిపిఓ రంగంలోని సంప్రదాయబద్దమైన హ్యుమన్ రోల్స్ అన్ని ఐటీ ఉద్యోగాలకు సమానం కావు. ఆటోమెషన్ ప్రభావంతో ఇతర రంగాలతో పోలిస్తే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఎక్కువ ప్రభావితం కానుందని రీసెర్చ్ రిపోర్టులు చెబుతున్నాయి.
అయితే కొన్ని రకాల ఐటీ ఉద్యోగాలు ఒక కన్పించే అవకాశాలు ఉండకపోవచ్చని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్ ఫ్రోఫెషనల్ ఎడ్యుకేషన్ ఫ్లాట్‌ఫామ్ సింప్లిలెర్న్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం వచ్చే ఐదేళ్ళలో కొన్ని ఉద్యోగాలు భారీగా పడిపోతున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది.
మాన్యువల్ టెస్టింగ్‌లో సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజనీర్, క్యూ ఏ ఇంజనీర్, మాన్యువల్ టెస్టర్ ఆటోమెషన్ కారణంగా ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదు.
సిస్టమ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్, మేనేజర్ , సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్, సర్వర్ మెంటెనెన్స్, మైంటెనెన్స్ ఇంజనీర్ విభాగాలపై తీవ్ర ప్రభావం కన్పించే అవకాశాలున్నాయి.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications