'హయ్ ఫిజిక్స్' అంటూ జలీల్ ఖాన్ ను టీజ్ చేసిన రోజా, నేను మాట్లాడిందంతా వేయలేదన్న జలీల్

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రఖ్యాతి పొందారు. ఇప్పటికే బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన పేరును మారుమోగేలా చేసింది.

అమరావతి:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రఖ్యాతి పొందారు. ఇప్పటికే బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన పేరును మారుమోగేలా చేసింది. అయితే అనతికాలంలోనే ఇంత పాపులర్ కావడానికి కారణం రివర్స్ ప్రచారమేనని ఆయన తన సహచర ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు.

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం నాడు టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో మాట్లాడేందుకు పలువురు ఎమ్మెల్యేలు పోటీపడ్డారు.అనతికాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం రావడానికి కారణం ఏమటినే విషయాన్ని ఎంఏల్ఏలు జలీల్ ఖాన్ ను అడిగి తెలుసుకొన్నారు.

హయ్ ఫిజిక్స్ అంటూ టీజ్ చేసిన రోజా

బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన జలీల్ ఖాన్ ను చాలామంది ఎంఏల్ఏలు ఫిజిక్స్ , బికాం అంటూ పిలుస్తున్నారు. ఇవే పదాలు ఉపయోగిస్తూ ఆయనను ఆటపట్టిస్తున్నారు. ఆయన కూడ సరదాగానే తీసుకొంటున్నారు.

funny conversation between jaleel khan and roja

బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ సామాజిక మాథ్యమాల్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది.వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మంగళవారం నాడు తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీకాం లో ఫిజిక్స్ ఉందనే చెప్పేవారికి తాను చెప్పే లెక్కలు అర్థం కావంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని వైఎస్ఆర్ సిపి ఎమ్మేల్యేలు ఉన్న లాబీల్లోకి విజయవాడ పశ్చిమ ఎమ్మేల్యే జలీల్ ఖాన్ వచ్చాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న వైసిపి ఎమ్మేల్యే రోజా హయ్ ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ ను పలకరించింది.

రోజాతో పాటు ఇతర మహిళ ఎమ్మేల్యేలు కూడ జలీల్ ఖాన్ వద్దకు వచ్చారు.ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసినా తమకు అంత ప్రచారం రావడం లేదు, కాని, కామర్స్ లో పిజిక్స్ ఉంటుందని చెప్పగానే మంచి పాపులారిటీ వచ్చిందని రోజా జలీల్ ఖాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయితే సీదాగా చెబితే మీడియా వాళ్ళు సక్రమంగా చూపిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఉల్టాగా చెబితేనే ప్రాచుర్యం వస్తోందని ఆయన వైసిపి ఎమ్మేల్యేలకు హితవు పలికారు.

ఇంతలో అక్కడికి వచ్చిన వైసిపి ఎమ్మేల్యేలు జంకె వెంకట్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు అన్నా బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని మీరిచ్చిన ఇంటర్వ్యూతో పెద్ద ఫిగర్ అయిపోయారని చెప్పారు..దీనికి ఆయన స్పందిస్తూ తాను మాట్లాడిందంతా వేయలేదని ఆయన చెప్పారు. మీడియా వాళ్ళకు ఏం కావాలో అదే వేసుకొంటారని ఆయన చెప్పారు. అయితే భవిష్యత్తులో బికాంలో ఫిజిక్స్ ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.అయితే మీ ముఖ్యమంత్రి అమరావతిని సింగపూర్ చేస్తా అని చెబుతారు కద, దాని కంటే ఇదేమీ తప్పు కాదని ఆయన నవ్వులు పూయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+