'బీకాం లో ఫిజిక్స్ అన్నా' అంటూ జలీల్ ఖాన్ ను టీజ్ చేసిన సునీల్, 'రివర్స్' తప్పదన్న జలీల్
బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విజయవాడ పశ్చిమ ఎంఏల్ఏ జలీల్ ఖాన్ పై తీవ్రంగా అభాసు పాలయ్యారు. అయితే జలీల్ ఖాన్ తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు.
అమరావతి:బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విజయవాడ పశ్చిమ ఎంఏల్ఏ జలీల్ ఖాన్ పై తీవ్రంగా అభాసు పాలయ్యారు. అయితే జలీల్ ఖాన్ తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు.
బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ చేసిన ప్రకటన విపరీతంగా పాపులర్ అయింది.జలీల్ ఖాన్ అంటే తెలియనివారు కూడ ప్రస్తుతం ఆయనను గుర్తుపడుతున్నారు. ఆయన అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.

బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కు కౌంటర్లు, వీడియోలు, ఫన్నీ స్పూఫ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
అయితే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకొంది. జలీల్ ఖాన్ ను వైఎస్ ఆర్ సిపి ఎంఏల్ ఏ సునీల్ బీకాంలో ఫిజిక్స్ అన్నా అంటూ సరదాగా టీజ్ చేశారు.దీంతో అక్కడే ఉన్న ఎంఏల్ఏలంతా నవ్వారు.
మీడియాలో హైలెట్ అవ్వాలంటే రివర్స్ చెప్పాలని, మనం ఎంత మాట్లాడినా వాళ్ళు కొంచెం కూడ చూపరని జలీల్ ఖాన్ సునీల్ తో చెప్పారు. అయితే తనకు అనుకొన్న దాని కంటే ఎక్కువ ప్రచారం వచ్చిందని జలీల్ ఖాన్ సంతోషంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications