లోకేష్ కాబోయే సీఎం.. టీజీ భరత్‌కు చంద్రబాబు మందలింపు

ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఏదైనా టీడీపీ అధిష్టానం, కూటమి నేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.

ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యూరిచ్‌లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రేట్' కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Future CM Nara Lokesh Chandrababu is serious about Minister TG Bharath

ఈ క్రమంలో నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తనతోపాటు లోకేష్ కూడా ఉన్న వేదికపై ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి వేదికపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీజీ భరత్‌పై చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి టీజీ భరత్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.

కాగా, జూరిచ్‌లో తెలుగువారితో జరిగిన సీఎం చంద్రబాబు మీట్ ది గ్రేట్ అనే కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ హ్యాండ్స్ అని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ఎవరికీ ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలు పాలిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. దీం మోస్ట్ డైనమిక్, యంగ్ లీడర్ మా నారా లోకేష్ అని టీజీ భరత్ వ్యాఖ్యానించారు.

ఉన్నత చదువులు చదవిన వ్యక్తి.. ఏపీ నుచి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదివిన వ్యక్తి నారా లోకేష్ అని.. మరెవరూ లేరని టీజీ భరత్ అన్నారు. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది తమకు విజన్ ఉందన్నారు. ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీకే ఉంది. తమ పార్టీలో క్లారిటీ ఉందన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని టీజీ భరత్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+