గాదెకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్: రేపో మాపో టిడిపిలోకి
విజయవాడ: చాలాకాలంగా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకట రెడ్ది.. ఇక రేపో.. మాపో.. పచ్చ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆయన టీడీపీ చేరిక జరిగిపోవాల్సి ఉన్నా.. ఏవో కొన్ని కారణాల వల్ల ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
అయితే ఇంత కాలం తర్వాత గాదెకి చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ దఫా ఆయన చేరిక ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక గాదె వెంకటరెడ్డి విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లా నుంచి మూడుసార్లు, గుంటూరు జిల్లా నుంచి బాపట్ట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్ది హయాంలోను, అటు తర్వాత వై.ఎస్.రాజశేఖర్ రెడ్ది, రోశయ్య హయాంలోను గాదె మంత్రిగా పని చేశారు.
2014 ఎన్నికల సమయంలో గాదె కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ ఆయన టీడీపీ గెలుపు కోసమే పనిచేశారన్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా టీడీపీలో గాదె చేరిక ఖాయం అయిపోయింది కాబట్టి మరి పార్టీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications