వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ లేఖల వెనక చంద్రబాబు-టీడీపీ ఆఫీస్ నుంచే వెళ్తున్నాయి-జల వివాదంపై బాంబు పేల్చిన గడికోట

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల జల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖ టీడీపీ అధినేత చంద్రబాబు రాయించినదేనని సంచలన ఆరోపణలు చేశారు. జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం రాస్తున్న లేఖలు హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయం నుంచే వారికి వెళ్తున్నాయని ఆరోపించారు. కేవలం సంతకాలు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లు పెడుతున్నారేమో అన్నారు. గతంలో సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు.

బాబు సమర్థించడం వల్లే ఇదంతా : గడికోట శ్రీకాంత్ రెడ్డి

బాబు సమర్థించడం వల్లే ఇదంతా : గడికోట శ్రీకాంత్ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు సమర్థించడం వల్లే అక్కడి ప్రభుత్వం కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు)కు లేఖలు రాస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పాత్రను పూర్తిగా మరిచిపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారుడిగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నిర్మాణం చేపట్టగా... దాన్ని వ్యతిరేకిస్తూ దేవినేని ఉమాతో కలిసి ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయిస్తున్నాడని ఆరోపించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజమని విరుచుకుపడ్డారు.

ఆ అర్హతే చంద్రబాబుకు లేదు : శ్రీకాంత్ రెడ్డి

ఆ అర్హతే చంద్రబాబుకు లేదు : శ్రీకాంత్ రెడ్డి

వ్యవసాయమే దండగ అని... తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణమే చేపట్టని చంద్రబాబు రైతు బాంధవుడిగా పేరొందిన జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కృష్ణా సాగునీటితో రాయలసీమ,నెల్లూరు వాసులే కాదు తెలంగాణలోని మహబూబ్ నగర్,నల్గొండ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే జగన్ ఎక్కడా... తన హయాంలో కనీసం 5శాతం ప్రాజెక్టులు కూడా పూర్తి చేయని చంద్రబాబు ఎక్కడ అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా సహకరించలేదని... ఆ పదేళ్లు కరువు కాటకాలతోనే గడిచిపోయిందని అన్నారు. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వరుసగా మూడో ఏడాది కూడా జులై నెల పూర్తవకముందే రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. సమృద్దిగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం,నాగార్జునసాగర్ నుంచి నీటిని కిందకు విడుదల చేశారన్నారు.

చంద్రబాబుకు కడుపు మంట : శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబుకు కడుపు మంట : శ్రీకాంత్ రెడ్డి

ప్రాజెక్టులు నిండితే రైతులు ఆనందంగా ఉంటారన్న విషయం కూడా చంద్రబాబు మరిచిపోయారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులు నిండకపోతే రైతులు కన్నీళ్లు పెడతారని... నిండితే బాబుకు కడుపుమంట అని విమర్శించారు. రైతులు సంతోషంగా ఉండవద్దనే దుర్బిద్ది చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు ఇప్పటికే రాజకీయంగా పతనమయ్యాడని అన్నారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావన్నారు. పంపకాల ప్రకారమే... తమ వాటా నీళ్లు వాడుకుంటున్నామని...దానివల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇదివరకు ఉన్న ప్రాజెక్టులను నింపడానికి తోడ్పడుతుందే తప్ప... అదనంగా కొత్త ఆయకట్టు,కొత్త జలాశయాలు నిర్మించట్లేదని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి సమంజసమా...?: శ్రీకాంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వానికి సమంజసమా...?: శ్రీకాంత్ రెడ్డి

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి,డిండి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు,కొత్త కాలువ వ్యవస్థ తీసుకొస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఓవైపు తమ ప్రాజెక్టులతో కొత్త కాలువలు గానీ,కొత్త జలాశయాలు గానీ నిర్మించట్లేదని తాము చెబుతుంటే... మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కృష్ణా నదిపై చేపడుతున్న ప్రాజెక్టులతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. శ్రీశైలం రిజర్వాయరులో 800 అడుగుల నుంచే 3 టీఎంసీల మేర నీటిని తరలించేందుకు 3 ప్రాజెక్టులు చేపడుతోందన్నారు. దీనికి తోడు శ్రీశైలం ఎడమవైపు 796 అడుగుల నుంచే 42వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారని అన్నారు. కానీ ఏపీ మాత్ంర 854 అడుగులు ఉన్నప్పుడే నీటిని తీసుకోవడానికి వీలవుతుందన్నారు. నీటిమట్టం 800 అడుగులకు చేరగానే తరలించుకుపోవడం సమంజసమా అని ప్రశ్నించారు. రాయలస

తెలంగాణ ప్రభుత్వ లేఖ

తెలంగాణ ప్రభుత్వ లేఖ


తెలంగాణ ప్రభుత్వం గురువారం(జులై 29) కేఆర్‌ఎంబీకి ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. కృష్ణాలో వరద కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతించాలని లేఖలో కేఆర్‌ఎంబీని ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వం జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 టీఎంసీలు గంపగుత్త కేటాయింపులని పేర్కొంది. 2021-22 ఏడాదికి గాను 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది. బేసిన్‌లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతే.. బేసిన్‌ అవతలి ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని కోరింది. అయితే ఈ లేఖలన్నీ చంద్రబాబు రాయిస్తున్నవేనని తాజాగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది.

English summary
Andhra Pradesh Chief Whip Gadikota Srikanth Reddy made sensational remarks over water dispute of the Telugu states. The recent letter written by the Telangana government to KRMB was actually from TDP chief Chandrababu,he alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X