వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బు నిలవడానికి, రెట్టింపు అవడానికి ఇవి ఫాలో అవ్వండి
నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తి డబ్బు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించడం ఒకెత్తయితే, ఆ సంపాదించిన లక్ష్మీదేవి ఇంట్లో నిలవడం, ఐశ్వర్యం వృద్ధి చెందడం మరొకెత్తు. చాలామంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని బాధపడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో సానుకూల శక్తి లోపించడం వల్లే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని నిపుణులు చెబుతున్నారు.ఇంట్లోకి సంపద వెల్లువలా రావాలన్నా, వచ్చిన ధనం రెట్టింపు అవ్వాలన్నా వాస్తు నిపుణులు సూచిస్తున్న సలహాలను తెలుసుకుందాం.
'టేకు' కలప పెట్టె
వాస్తు శాస్త్రంలో డబ్బును దాచే స్థలానికి, వస్తువులకు చాలా ప్రాధాన్యత ఉంది.
మీ ఇంట్లోని నగదును ఎప్పుడూ ప్లాస్టిక్ లేదా ఇనుప పెట్టెల్లో కాకుండా,
'టేకు' కలపతో చేసిన పెట్టెలో ఉంచడం శుభప్రదం.
టేకు చెక్కకు ఉండే స్థిరత్వ గుణం మీ ధనాన్ని మీ వద్దే నిలిచిపోయేలా చేస్తుంది.
ఒక ఎరుపు రంగు పట్టు వస్త్రంలో డబ్బును చుట్టి,
ఈ టేకు పెట్టెలో భద్రపరిస్తే..
ఆ సంపద రోజురోజుకూ రెట్టింపు అవుతుందని నమ్ముతారు.

ఉత్తర దిశ కిటికీ
ఇంట్లోకి సంపద నిరంతరం ప్రవహించాలంటే ప్రకృతి శక్తుల అనుగ్రహం ఎంతో అవసరం.
అందుకే ఇంటి ఉత్తర దిశ గోడకు కచ్చితంగా ఒక కిటికీ ఉండాలి.
ఆ కిటికీని వీలైనంత వరకు తెరిచే ఉంచాలి.
దీనివల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు సూర్యరశ్మి,
స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తాయి.
డబ్బును పూజ గదిలో పెడుతున్నారా?
చాలామంది భక్తితో డబ్బును పూజ గదిలోనో లేదా దేవుడి పటాల వద్దో పెడుతుంటారు.
కానీ వాస్తు ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు.
డబ్బు అనేది ఎంతోమంది చేతులు మారి,
రకరకాల శక్తులతో మీ వద్దకు వస్తుంది.
కాబట్టి దానిని పూజ గదిలో ఉంచకూడదు.
నగదును ఎల్లప్పుడూ ఇంటి నైరుతి మూలలో భద్రపరచడం ఉత్తమం.
ఇది సంపదను స్థిరంగా ఉంచుతుంది.
డబ్బు ఇచ్చేటప్పుడు ఈ 'రహస్యం' పాటించండి
మనం ఇతరులకు డబ్బులు ఇచ్చేటప్పుడు చేసే చిన్న పొరపాటు కూడా
మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది.
ఎవరికైనా నోట్లు ఇచ్చేటప్పుడు వాటిని మడతపెట్టి ఇవ్వాలి.
నోటు మడతపడిన వైపు అవతలి వ్యక్తికి కనిపించాలి.
నోటు తెరిచి ఉన్న భాగం మీ వైపునకు ఉండాలి.
ఇలా చేయడం వల్ల మీ ఇంటి ధనలక్ష్మి ఇతరుల పాలు కాకుండా,
తిరిగి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
డబ్బు పెట్టెలో 'సుగంధ పరిమళం'
లక్ష్మీదేవికి స్వచ్ఛత, సువాసనలంటే ఎంతో ఇష్టం.
అందుకే మీ క్యాష్ బాక్స్ లేదా లాకర్ ఎప్పుడూ మంచి పరిమళం వచ్చేలా చూసుకోవాలి.
డబ్బు పెట్టెలో ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్కను ఉంచండి.
ఇది అక్కడ ఉన్న ప్రతికూల శక్తిని నశింపజేసి,
సానుకూల శక్తిని పెంచుతుంది. తద్వారా సంపద వేగంగా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications