విజయ్ కేబినెట్ విస్తరణ..! AIADMK రెబెల్స్ చేరికపై టీవీకే క్లారిటీ..!

తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన టీవీకే (TVK).. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ తో పాటు అన్నాడీఎంకే రెబెల్స్ మద్దతు కూడా తీసుకుని అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే రెబెల్స్ ను కూడా కూటమిలో చేర్చుకుని, వారికి మంత్రిపదవులు కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన సీపీఎం.. అలాగే మద్దతు ఉపసంహరిస్తామని వార్నింగ్ ఇచ్చింది.

దీంతో ఇవాళ విజయ్ పార్టీ టీవీకే.. సీపీఎం హెచ్చరికలపై స్పందించింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య, టీవీకే ప్రభుత్వం క్యాబినెట్‌లో అన్నాడీఎంకే రెబెల్స్‌కు వెంటనే చోటు కల్పించే ప్రణాళిక లేదని రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున స్పష్టం చేశారు. విస్తరణకు సంబంధించి తీవ్రమైన రాజకీయ ఊహాగానాలు, అన్నాడీఎంకే రెబెల్ నాయకులు ప్రభుత్వంలో చేరతారని వార్తలు ప్రచారం వేళ, మంత్రి ఆధవ్ అర్జున అధికార టీవీకే వైఖరిని స్పష్టం చేశారు. కూటమి ఐక్యంగా ఉందని, ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్ "ఒకే కుటుంబంలా" పనిచేయాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

CPM Warns TVK Responds Vijay s Party Clarifies Stand on AIADMK Rebels and Cabinet Expansion

టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు సీపీఎంతో పాటు వీసీకే వంటి మూడు పార్టీలను ఆహ్వానించిందని ఆధవ్ అర్జున గుర్తుచేశారు. అయితే తాజాగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం అన్నాడీఎంకే రెబెల్స్‌ను క్యాబినెట్‌లో చేర్చుకుంటే విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పార్టీ మద్దతును పునరాలోచిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలు టీవీకే ప్రభుత్వం తన మొదటి క్యాబినెట్ విస్తరణకు ముందు కొత్త రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి. అదే సమయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నైకి చేరుకోవడం విస్తరణ ప్రక్రియ, కూటమి భాగస్వాములను చేర్చడంపై చర్చలకు మరింత ఆజ్యం పోసింది.

CPM Warns TVK Responds Vijay s Party Clarifies Stand on AIADMK Rebels and Cabinet Expansion

తాజా పరిణామాలపై స్పందించిన మంత్రి ఆధవ్ అర్జున.. టీవీకే ప్రభుత్వం కేవలం 'అధికార పంపిణీ' ఒప్పందాలపై కాకుండా, 'సమ్మిళిత పాలన, విస్తృత రాజకీయ ప్రాతినిధ్యంపై దృష్టి సారించింద్నారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ ఒకే కుటుంబంలా పనిచేయాలని కోరుకుంటున్నారన్నారు. మద్దతు ఇచ్చిన పార్టీలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారన్నారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కూటమి పటిష్టంగా ఉందని, క్యాబినెట్ విస్తరణ గురించి ముఖ్యమంత్రి విజయ్ త్వరలో ప్రకటన చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+