తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్డేట్- లబ్దిదారులు ఖరారు-నిధుల రిలీజ్..!

ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం (Talliki Vandanam) పథకంలో భాగంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు ఇస్తున్న 13 రూపాయల నిధులు రెండో విడతపై స్పష్టత వచ్చింది. తొలి విడత నిధుల విడుదల తర్వాత కొత్తగా స్కూళ్లు, కాలేజీల్లో జాయిన్ అయిన విద్యార్ధుల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం లబ్దిదారుల్ని ఖరారు చేసింది. ఈ మేరకు వారికి ఇవ్వాల్సిన నిధుల విడుదలపై ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

హిందూమతంలోకి జగన్ .! ఇప్పటికీ తిరుమల నెయ్యి కల్తీ-సాయిరెడ్డి కామెంట్స్..!
హిందూమతంలోకి జగన్ .! ఇప్పటికీ తిరుమల నెయ్యి కల్తీ-సాయిరెడ్డి కామెంట్స్..!

తల్లికి వందనం పథకంలో భాగంగా రెండో విడత నిధుల విడుదల కోసం అందిన ఫిర్యాదుల పరిష్కారం అనంతరం 3,29,201 మంది అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఖరారు చేసింది. వీరికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ₹10,208.69 కోట్లు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. త్వరలోనే ఈ నిధులు విడుదల కాబోతున్నాయి. దీంతో తల్లికి వందనం పథకం కింద అర్హులైన అందరు లబ్దిదారులకు ఈ ఏడాదికి నిధులు ఇచ్చినట్లవుతుంది.

Talliki Vandanam Second Phase AP Govt Finalises 3 29 Lakh Beneficiaries order for funds release
Talliki Vandanam: తల్లికి వందనం రెండో విడతకు ముహుర్తం ఫిక్స్- కీలక అప్డేట్..!
Talliki Vandanam: తల్లికి వందనం రెండో విడతకు ముహుర్తం ఫిక్స్- కీలక అప్డేట్..!

వాస్తవానికి తల్లికి వందనం కింద గతంలో అర్హులై నిధులు అందని వారికి ఆగస్టు 30న వీరి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వచ్చే వారం ఈ నిధుల జమకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 వేల కోట్లకు పైగా నిధుల విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో వచ్చే వారం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదల చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇందుకోసం విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే వచ్చే వారం వీరి ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఇంట్లో ఎంత మంది చదువుకుంటున్న పిల్లలుంటే అంతమందికీ 13 వేల చొప్పున నిధులు జమ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+