ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు- తల్లికి వందనం విస్తరణ, డైట్ ఛార్జీల పెంపు, ఇళ్ల స్థలాలపై కమిటీ..!

ఏపీ రాజధాని అమరావతిలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, భూములు, ఉన్నత విద్యకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా కేబినెట్ అభినందనలు, ప్రశంసలు, శుభాకాంక్షలు తెలిపింది. మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక వసతులు, సాంకేతికత ఆధారిత పాలన, సంక్షేమ పథకాల అమలు, ఆవిష్కరణలు, స్వావలంబన వంటి రంగాల్లో జరిగిన మార్పులను ప్రశంసించింది.

ఏపీ పెన్షన్లలో కీలక మార్పులు- ఈసారి చేతికి ఎంత ? బ్యాంకుల్లో పడేది ఎంత ?
ఏపీ పెన్షన్లలో కీలక మార్పులు- ఈసారి చేతికి ఎంత ? బ్యాంకుల్లో పడేది ఎంత ?

రాష్ట్రంలోని ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, నిర్వహించి, విశ్లేషించేందుకు ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (APHIMS)ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విధుల్లో ఉండగా మరణించే అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్‌-ఆఫ్‌-సర్వీస్‌ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని నిర్ణయించారు. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 5 వేల చొప్పున, గరిష్ఠంగా లక్షన్నర వరకు చెల్లించనున్నారు. ఇందుకోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2.19 కోట్లను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. అదనంగా 66 పోస్టులను ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Cabinet Passes Key Decisions on Talliki Vandanam Diet Charges hike house sites and Free Coaching
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

2026-27 విద్యా సంవత్సరానికి 'తల్లికి వందనం' (Talliki Vandanam) పథకానికి సంబంధించిన ఉత్తర్వులను ర్యాటిఫై చేయడంతో పాటు, అదనంగా 58,601 మంది అర్హత కలిగిన విద్యార్థులను పథకం పరిధిలోకి తీసుకురావడానికి సవరించిన పరిపాలనా అనుమతిని కేబినెట్ ఇచ్చింది. రెండో దశలో ఎంపికైన 3,29,201 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం విడుదలకు కూడా ఆమోదం తెలిపింది. దీంతో పథకం కింద లబ్ధి పొందే అర్హులైన విద్యార్థుల సంఖ్య 68,05,791కి చేరింది. అలాగే సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హోమ్‌లు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో ఉంటున్న విద్యార్థులకు అందించే డైట్‌ ఛార్జీలను 10 శాతం పెంచారు. ఈ పెంపు 2026 అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 6,28,409 మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.

AP Cabinet Passes Key Decisions on Talliki Vandanam Diet Charges hike house sites and Free Coaching
సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల కేసు-ఢిల్లీలో ఏపీ మంత్రుల పాగా- లాబీయింగ్..!
సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల కేసు-ఢిల్లీలో ఏపీ మంత్రుల పాగా- లాబీయింగ్..!

విశాఖపట్నంలోని మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రత్యేక రెసిడెన్షియల్ కోచింగ్‌ అందించే ఈ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా 600 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఇందులో 300 మంది బాలురు, 300 మంది బాలికలకు అవకాశం ఉంటుంది. విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, భారతీయ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్నత విద్య, ప్రైవేటు యూనివర్సిటీల విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వదిలేసిన రిజిస్ట్రర్డ్‌ స్థలాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి అర్హులకు కేటాయించే అంశాలను కమిటీ పరిశీలించనుంది. ఆవాస్‌ సర్వేలో ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించిన సుమారు 2 లక్షల మందికి భూసేకరణ అంశాన్ని కూడా పరిశీలించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+