చెన్నైలో సీఎం విజయ్ తో రాహుల్ గాంధీ ఫార్మల్ మీటింగ్.. !!

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు రాజధాని చెన్నైలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. యువతతో నేరుగా మమేకం అయ్యే ఛాత్రోం కీ గూంజ్ కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పర్యటనకు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఎంపీ మాణిక్కం ఠాగూర్, ఇతర నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చెన్నైలోని ఓ హోటల్ లో వారితో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక అంశాలు, ప్రతిపక్షాల వ్యూహాలు, రాబోయే ఎన్నికల ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.

LoP Rahul Gandhi met Tamil Nadu CM Vijay in Chennai as he is scheduled to hold Chhatron Ki Goonj

ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడే దిశగా, మిత్రపక్షాలతో సమన్వయాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న టీవీకేతో సమన్వయం చేసుకోవడానికి సంబంధించిన కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.

ఢిల్లీ దిగ్బంధం వేళ.. చెన్నైలో రాహుల్ గాంధీ
ఢిల్లీ దిగ్బంధం వేళ.. చెన్నైలో రాహుల్ గాంధీ

అనంతరం చెన్నైలోని ఓ హోటల్ లో టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్ తో సమావేశం అయ్యారు రాహుల్ గాంధీ. టీవీకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైకి వచ్చిన రాహుల్ ను విజయ్ మర్యాదపూరకంగా కలిశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించినందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు రాహుల్ గాంధీ.

టీవీకే సారథ్యంలోని తమ కూటమి పాలనకు తాజా ప్రజా తీర్పు అద్దంపట్టిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకునే ప్రజానుకూల నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను రికార్డు సమయంలో కార్యరూపంలోకి తీసుకుని రావడం.. ప్రజల పట్ల తమ కూటమి, పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఈ భేటీ ముగిసిన తర్వాత ఐలాండ్ గ్రౌండ్స్‌లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నిర్వహించే ఛాత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. ఈ వేదికపై ముందస్తుగా క్యూఆర్ కోడ్ పొందిన దాదాపు 10,000 నుండి 20,000 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సాధారణ ప్రజలకు ప్రవేశం లేకుండా ప్రత్యేక కేటగిరీ కారిడార్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+