ఓడిపోతే నా తప్పేంది భయ్యా!

వరుసగా నాలుగు మ్యాచుల్లో వైఫల్యం చెందిన అనంతరం వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌లోకి తిరిగొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజు శాంసన్.. ఆ తర్వాత ఇంగ్లాండ్, జపాన్ టూర్లతో పాటు వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రాణించలేకపోయాడు. అయితే రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో 200 స్ట్రైక్ రేట్ తో కేవలం 41 బంతుల్లోనే 82 పరుగులు చేసి తన బ్యాటింగ్ ప్రతాపాన్ని మళ్లీ చూపించాడు.

IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!
IND vs WI: రూథర్‌ఫోర్డ్, హోప్ ఊచకోత.. భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం!

నా మెరుపు ఇన్నింగ్స్ తర్వాత తన ఫామ్‌పై, గత కొన్ని మ్యాచుల్లో వైఫల్యంపై సంజు శాంసన్ స్పందించాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో ఏమైనా మార్పులు చేశారా అని బ్రాడ్ కాస్టర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. "అలాంటిదేమీ లేదు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రికెటర్‌గా మన చేతుల్లో ఉన్న శిక్షణ, సాధన, సన్నాహాలపైనే మనం దృష్టి పెట్టాలి. ఈ టీ20 ఫార్మాట్లో మ్యాచ్ ఫలితం మన చేతుల్లో ఉండదు" అని వెల్లడించాడు.

Sanju Samson Scores 82 Off 41 Balls vs West Indies Speaks On His Form and Failure Full Details

తన వైఫల్యాలకు ఎవరినీ నిందించనని సంజు శాంసన్ స్పష్టం చేశాడు. "మూడు ఇన్నింగ్స్‌లలో పరుగులు చేయలేదు కదా అని, క్రీజులో ఎక్కువ సమయం తీసుకొని నిలదొక్కుకున్నాక ఆడదాం అనుకోవడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలే ఎప్పుడైనా మొదటి ప్రాధాన్యత. నేను విఫలమైతే దానికి నన్నే బాధ్యుడిగా భావిస్తాను తప్ప వేరొకరిని నిందించను. స్టేడియంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడానికే ప్రయత్నిస్తాను" అని పేర్కొన్నాడు.

నాకు నోబెల్ కావాల్సిందే.. మారాం చేస్తున్న ట్రంప్!
నాకు నోబెల్ కావాల్సిందే.. మారాం చేస్తున్న ట్రంప్!

22 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 176 స్ట్రైక్ రేట్‌తో 628 పరుగులు చేసిన సంజు శాంసన్ క్రీజులో సెట్ అయితే భారీ ఇన్నింగ్స్ ఆడతాడనే పేరు తెచ్చుకున్నాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉండగా.. నాలుగు సార్లు 80కి పైగా పరుగులు సాధించడం విశేషం. అయితే రాంచీ మ్యాచ్‌లో సంజు శాంసన్ 82 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత జట్టుకు ఓటమి తప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+