"ఎక్కడ ఆపితే అక్కడే జంతర్ మంతర్..!"- కాక్రోచ్ కొత్త బాస్ ఆజింక్య ఫస్ట్ మెసేజ్..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన నిర్వహించేందుకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నేతల్ని ఉదయం ఢిల్లీ చేరుకోగానే వారి విమానంలోనే అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రాంతాలకు తరలించారు. ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు మరో ఇద్దరు నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఉన్నారు. వీరి గైర్హాజరీలో జంతర్ మంతర్ నిరసనల్ని నడిపించేందుకు బాధ్యతలు తీసుకున్న సీజేపీ మరో నేత అజింక్య షిండే (Ajinkya Shinde) నిరసనకారులకు కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు.

పోలీసులకు కాక్రోచ్ ల అనూహ్య ఝలక్..! దిప్కే స్ధానంలో కొత్త బాస్..!
పోలీసులకు కాక్రోచ్ ల అనూహ్య ఝలక్..! దిప్కే స్ధానంలో కొత్త బాస్..!

తమ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన నేతలు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను మోడీ-షా సర్కార్ ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుందని సీజేపీ కొత్త బాస్ అజింక్య షిండే తెలిపారు. ఈ నియంతృత్వ ప్రభుత్వం దేశంలోని యువతకు మరోసారి భయపడిందని ఆయన పేర్కొన్నారు. గతంలో దేశమంతా ఒక్కటై జంతర్ మంతర్ కు వచ్చినప్పుడు మోడీ-షా సర్కార్ అహంకారాన్ని తాము బద్దలు కొట్టామన్నారు. అందుకే మరోసారి జంతర్ మంతర్ కు మేం రాకుండా రైళ్లు, రోడ్లు బంద్ చేసిందన్నారు. భారీ ఎత్తున జనాన్ని అదుపులోకి తీసుకొంటున్నారని, ఇది మోడీ-షా భయాన్ని బయటపెడుతోందన్నారు.

CJP s Ajinkya Shinde Issues First Call to Protesters Wherever Police Stop You Is Jantar Mantar
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!

ఈ పోరులో తాము ఇప్పటికే సగం విజయం సాధించామని అజింక్య షిండే గుర్తుచేశారు. మరో కొత్త పోరాటానికి ఇది ఆరంభం అన్నారు. మాతో పాటు ఈ దేశ ప్రజలు కూడా తమ ఓటు హక్కు చోరీకి గురైందని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ దీన్ని లాక్కున్నారని, దీన్ని తిరిగి ఇవ్వమని కోరుతున్నామన్నారు. అలాగే దీనికి కారణమైన సీఈసీ రాజీనామా చేయాలని కోరుతున్నామని తెలిపారు. దీన్ని తట్టుకోలేక ఢిల్లీ మొత్తం అత్యవసర పరిస్ధితి సృష్టించిందన్నారు. అందుకే ఎక్కడ ఉన్న నిరసనకారులైనా జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని, పోలీసులు అడ్డుకుంటే మాత్రం అక్కడే జంతర్ మంతర్ గా మార్చుకుని ఆందోళనలు కొనసాగించాలన్నారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకూ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+