దీనికేం పోయే కాలమో మరి.. 11 ఏళ్ల బాలుడ్ని లైంగికంగా వేధించిన మహిళా ఇన్ ఫ్లూయెన్సర్..

నేటి సమాజంలో రోజురోజుకూ చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కేరళలోని త్రిస్సూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్.. లక్షల్లో పాపులారిటీ ఉంది. కానీ ఇప్పుడు ఆమెపై పోక్సో కేసు నమోదు కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమెనే కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్‌.

NishaRaphael Female influencer sexually harassed an 11-year-old boy in kerala POCSO case registered

11 ఏళ్ల బాలుడిపై నిషా రాఫెల్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు కొద్దిరోజుల క్రితం త్రిస్సూర్ వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలుడి వాగ్మూలం ఆధారంగా పోలీసులు ఆమెపై పోక్సో కేసును నమోదు చేశారు. అలాగే బాలుడ్ని త్రిస్సూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి మెడికల్ పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టుల్లో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో త్రిస్సూర్ వెస్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది తప్పుడు కేసు అని.. నిషా ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కేసు పెట్టారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిషా వర్గానికి అలాగే ఫిర్యాదుదారుడికి మధ్య రెండు ప్లాట్స్ కు సంబంధించిన వివాదం ఉందని ఆ వివాదం కారణంగానే ఈ కేసుకు కారణమని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇక ఈ ఘటనపై నిందితురాలిని ప్రశ్నించడంతోపాటు ఇతర వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉందని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసు మైనర్ కు సంబంధించిన కేసు కావడంతో బాలుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇక ఈ ఘటన ప్రస్తుతం కేరళతోపాటు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+