నాకొచ్చిన నష్టం ఏమీ లేదు- బీసీసీఐకి మహ్మద్ షమీ చురకలు

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ జాతీయ జట్టులో తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ లో ఎంపిక కాకపోవడం పట్ల స్పందించాడు. ఈ సిరీస్ కోసం మరో పేసర్ భువనేశ్వర్ కుమార్‌ అనూహ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే సమయంలో షమీకి ఎంట్రీ దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలపై మొదటిసారిగా మౌనం వీడాడు.

తనను మళ్ళీ టీమిండియాలోకి తీసుకోకపోతే వచ్చే నష్టమేమీ లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా రాబోయే రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టుకు మెరుగైన ప్రదర్శన అందించడంపైనే ఉందని షమీ తేల్చి చెప్పాడు. భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ తనకు సంతోషాన్ని ఇస్తోందని, తోటి బౌలర్‌కు అవకాశం రావడాన్ని స్వాగతిస్తోన్నానని పేర్కొన్నాడు. భువనేశ్వర్ కుమార్ లేదా మరో తోటి ప్లేయర్ సెలెక్షన్ తో పోల్చుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కడ అవకాశం వచ్చినా తన శ్రమను నమ్ముకుని ఆడతానని వ్యాఖ్యానించాడు.

Mohammed Shami Open up on non selection to Team India does not bother him current focus is domestic

గత రెండు మూడేళ్లుగా బెంగాల్ తరఫున నిలకడగా రాణిస్తోన్నానని, ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటూనే ఉన్నానని గుర్తు చేశారు. అయినప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం నిరాశకు గురి చేయట్లేదని, దేశవాళీ మ్యాచ్ లపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తానని పేర్కొన్నాడు. భారత్ తరఫున ఆడే అవకాశం మళ్ళీ రాకపోయినా, తాను సాధించిన ఘనతలను అది తగ్గించలేదని తేల్చి చెప్పాడు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లా కళ్యాణిలో రంజీ జట్టుతో కలిసి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొంటోన్నాడు 36 ఏళ్ల షమీ. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్ ఆడాల్సి ఉంది దీనికోసం శ్రమిస్తోన్నాడు. న్యూజిలాండ్ పర్యటన కోసం టెస్ట్, వన్డే జట్లను కూడా బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ తరుణంలో షమీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బెంగాల్ జట్టులోని సహచర పేసర్లు ఆకాశ్ దీప్, ముకేష్ కుమార్‌లతో కలిసి బౌలింగ్ విభాగాన్ని నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, శాయశక్తులా ఆడటం వరకే తన చేతుల్లో ఉందని షమీ వ్యాఖ్యానించాడు.

సుదీర్ఘ కాలంగా టీమిండియా పేస్ విభాగానికి వెన్నుముకగా నిలిచిన షమీ.. చివరిసారిగా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అద్భుతంగా ఆడాడు. అయిదు మ్యాచ్ లల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలసి ఇప్పటివరకు 462 వికెట్లు సాధించాడు. 64 టెస్టుల్లో 229, 108 వన్డేల్లో 206, 25 టీ20ల్లో 27 వికెట్లు తీశాడు. ఆ తర్వాత గాయాలు, ఫామ్ కోల్పోవడంతో జట్టులో చోటు దక్కట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+