Gaganyaan: ట్విస్టుల మీద ట్విస్టులు.. ఫైనల్‌గా
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 మిషన్లను విజయవంతం చేసింది ఇస్రో. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను అంతరిక్ష ప్రయాణం సజావుగా సాగుతోంది. త్వరలో అది లాగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది.
ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఈ రెండింటి వద్దే ఆగట్లేదు. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మిషన్ తొలి ప్రయత్నంలో అనేక మలుపులు సంభవించాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది ఈ మిషన్ ఫస్ట్ అటెంప్ట్. ఎట్టకేలకు సుఖాంతమైంది. తాము పట్టిన పట్టు వదల్లేదు ఇస్రో శాస్త్రవేత్తలు. మొరాయించిన రాకెట్‌ను గంటన్నర వ్యవధిలోనే సరి చేశారు. దాన్ని విజయవంతం చేశారు.
నిజానికి- క్రూ మాడ్యుల్‌ను మోసుకుంటూ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి.. ఈ ఉదయం 8 గంటలకు ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లాల్సి ఉంది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో దాన్ని 8: 30 గంటలకు వాయిదా వేశారు. క్రూ మాడ్యుల్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని చిన్నపాటి లోపాలు కనిపించాయి. దీనితో మళ్లీ 15 నిమిషాలు వాయిదా వేశారు. 8:45 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు.
#WATCH | Sriharikota: ISRO launches test flight for Gaganyaan mission
— ANI (@ANI) October 21, 2023
ISRO says "Mission going as planned" pic.twitter.com/2mWyLYAVCS
అప్పుడు కూడా రాకెట్ ప్రయోగం విఫలమైంది. కౌంట్ డౌన్ ముగియడానికి చివరి అయిదు సెకెన్ల వద్ద ప్రయోగాన్ని నిలిపివేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. అక్కడితో ఆగపోలేదు. దీనిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
రాకెట్ పైకి ఎగరకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. డేటాను సేకరించారు. వాటన్నింటినీ విశ్లేషించిన అనంతరం లోపం ఎక్కడ తలెత్తిందో గుర్తించారు. అప్పటికప్పుడు దాన్ని సరి చేశారు. మళ్లీ కౌంట్ డౌన్ చేపట్టారు. సరిగ్గా ఈ ఉదయం 10 గంటలకు మిషన్‌ను లాంచ్ చేశారు. ఇది సక్సెస్ అయింది. క్రూ మాడ్యుల్‌ను తీసుకుని రాకెట్ అంతరిక్షం వైపు దూసుకెళ్లింది.












Click it and Unblock the Notifications