కిరణ్ కొత్త పార్టీలో ఇద్దరే, సోనియా చంబల్ రాణి: గాలి

హైదరాబాద్/నిజామాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెడతారనుకుంటున్న కొత్త పార్టీపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విసుర్లు సంధించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, అందులో కిరణ్ కుమార్ రెడ్డి, అతని తమ్ముడు తప్ప ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు.

ప్రజారాజ్యం పార్టీలానే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనమవుతుందని అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి కథా, స్ర్కీన్ ప్లే మొత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియానేనని ఆరోపించారు. తెలంగాణ బిల్లు రాదంటూ నాడు ఏపిఎన్జీవోల సమ్మెను సిఎం విరమింపజేయడం కూడా సోనియా కుట్రలో భాగమేనని ఆయన ధ్వజమెత్తారు. ఏపిఎన్జీవోలు ఆనాడు మరికొంత కాలం సమ్మె చేసి ఉంటే కేంద్రం తలొగ్గేదని ఆయన అన్నారు.

Gali Muddukrishnama

సోనియా గాంధీని చంబల్ రాణిగా అభివర్ణించిన ఆయన, దేశాన్ని దోచుకుని ఇటలీ పారిపోవడానికి విమానం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటు మూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకోవచ్చనే ఆలోచనకు ప్రేరణ కిరణ్ కుమార్ రెడ్డేనని గాలి విమర్శించారు. భారతీయ
జనతా పార్టీ కూడా రాష్ట్ర విభజన విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.

హై సెక్యూరిటీ ప్లేట్ల కుంభకోణంలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడితోపాటు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణల హస్తం ఉందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ ఎన్నికల బడ్జెటేనని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. సోనియాను చంద్రబాబు గాడ్సే అనడం చిన్న విమర్శని గాలి అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: షబ్బీర్ అలీ

నిజామాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని గాడ్చే అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లో తెలంగాణ ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ నాటకాలాడుతోందని ఆయన ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తెలిపారు. విభజన తర్వాత కూడా మూడు ప్రాంతాల ప్రజలు కలిసే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసమే ఈ ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్గదర్శనంతోనే ఏపిఎన్జీవోలు ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+