బాబు టార్గెట్‌గా.. వైయస్ 'తెలంగాణవాదం', జగన్ కులవాదం: గాలి

హైదరాబాద్: 1999లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నాడు వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతీయవాదాన్ని ఎగదోస్తే ఇప్పుడు, వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కులాన్ని ఎగదోస్తున్నారని ఏపీ టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం ధ్వజమెత్తారు.

ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. రాజధాని కట్టాలి, ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి.. ఇలా ఎన్నో సమస్యలు ఆయన ముందున్నాయని చెప్పారు.

నాడు వైయస్ రాజశేఖర రెడ్డి, నేడు వైయస్ జగన్.. ప్రాంతీయ, కులాలను వాడుకొని చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక తాను అధికారంలోకి రాలేనని భావించిన వైయస్ తెలంగాణ అంటూ ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు ఇప్పించారన్నారు.

Gali Muddukrishnama Naidu blames YS Jagan for casteism

ఆ తర్వాత 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని గెలిచారన్నారు. అప్పుడు తండ్రి ప్రాంతీయ వాదాన్ని ఉపయోగించుకుంటే, ఇప్పుడు వైసిపి అధినేత జగన్ కులవాదాన్ని వాడుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

గాలి, ముద్దు, ప్రాంతాల విద్వేషం తెలంగాణ మధ్య లేవదీసింది వైయస్ రాజశేఖర రెడ్డియే, 1999లోచంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇక తాను అదికారంలోకి రానేమో అని సపరేట్ తెలంగాణ అని ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు ఇప్పించింది వైయస్, 2004లో తెరాసతో పోత్తు పెట్టుకోని, అప్పుడు తండ్రి ప్రాంతీయ వాదాన్ని వాడుకున్నారు, ఇప్పుడు జగన్ కుల వాదాన్ని వాడుకుంటున్నారు,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+