ఇంత దుర్మార్గమా, మాకు ప్రత్యేక దేశం ఎందుకొద్దు: గాలి

gali muddukrishnama naidu
హైదరాబాద్: సీమాంధ్రుల పైన ఇంతటి దుర్మార్గం జరిగినప్పుడు తాము ఈ దేశంలో ఎందుకుండాలని, తాము ప్రత్యేక దేశంగా ఎందుకు ఉండకూడదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని త్వరలో తరిమి కొట్టే రోజులు వస్తాయన్నారు.

సోనియా, రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్ పేరును మంటగలిపేలా చేశారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టకునేందుకే ఎంపీలను లోకసభలో సస్పెండ్ చేశారని ఆరోపించారు. సోనియా డ్రామాలో కిరణ్, సీమాంధ్ర నేతలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భాగస్వాములన్నారు.

భారతీయ జనతా పార్టీ విభజన పైన పునరాలోచన చేయాలని హితవు పలికారు. ఎన్నికల ముందు జరుగుతున్న విభజనకు తాము సహకరించేది లేదని బిజెపి తేల్చి చెప్పాలన్నారు. దేశ విచ్చిన్నానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెసుకు బిజెపి అండదండలు ఉండవద్దని కోరారు. దేశాన్ని ఓ విదేశీ వనిత నాశనం చేస్తుందన్న అపవాదు సోనియా గాంధీకే అన్నారు.

లగడపాటిపై అంజన్ నిప్పులు

లోకసభలో పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటి రాజగోపాల్ పైన సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. లగడపాటి అభినవ గూండా అని, భగత్ సింగ్‌తో పోల్చడం సిగ్గు చేటన్నారు. దాడి చేయకముందే చేశారని అబద్దం ఆడుతున్నారన్నారు. అసలు దాడి చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. తెలంగాణ రాకపోతే అసలైన దాడి ఏమిటో చూస్తారని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+