చంద్రగిరి నుండి టిడిపి అభ్యర్థిగా గల్లా, క్యాడర్ అసంతృప్తి

అక్కడ ఆమె సరైన అభ్యర్థి అవుతారని వారంతా చెప్పడంతో ఆమెనే అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ప్రస్తుతం అరుణ ఆ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల కోసం పని చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సీటుకు పార్టీ అభ్యర్థిగా వెంకటేశ్‌ను ఖరారు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్‌ను సుభాష్ రెడ్డికి ఖరారు చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా సోయం బాబూరావును ఎంపిక చేశారు.
ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే జి నగేష్ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లడంతో గతంలో ఆ నియోజకవర్గంలో తెరాస తరపున గెలిచిన బాబూరావును పార్టీలోకి తీసుకువచ్చి అభ్యర్థిగా నిశ్చయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఇవ్వనున్నారు. కొట్టు ఇక్కడ చంద్రబాబును కలిసి ఆయన సమక్షంలో టిడిపిలో చేరారు.
గల్లాపై అసంతృప్తి
మరోవైపు గల్లా అరుణ కుమారి పట్ల చిత్తూరు, ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గ టిడిపి క్యాడర్ అసంతృప్తితో ఉందని అంటున్నారు. ఇన్నాళ్లు తమకు వ్యతిరేకంగా పని చేసిన గల్లా అరుణ పార్టీలో చేరడం, ఆమెను గెలిపించేందుకు తాము కృషి చేయాల్సి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట.
ఆమె అధికారంలో ఉన్నప్పుడు తమ పైన కేసులు పెట్టి వేధించారని గుర్తు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గల్లా బిజీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించి, తన సత్తా చూపించాలని ఆమె భావిస్తున్నారు. అయితే, ఆమె తన ప్రచారంలో టిడిపి క్యాడర్ కంటే తన వర్గం వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications