కాంగ్రెసే లేదు.. ఎలా ఉంటాం: గల్లా, పవన్ పార్టీపై కోట్ల
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో అసలు కాంగ్రెసు పార్టీయే లేనప్పుడు ఇంకా ఆ పార్టీలో ఎలా ఉంటామని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి శనివారం అన్నారు. తన తనయుడు గల్లా జయదేవ్‌తో కలిసి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెసు పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీయే లేదన్నారు. ఇక ఆ పార్టీలో ఉండడం కుదరదని చెప్పారు. కకావికలమైన తెలుగు జాతిని కేవలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే కాపాడగలరని చెప్పారు.
కిరణ్‌కు అంత డబ్బెక్కడిది: బాలరాజు
కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి బాలరాజు మండిపడ్డారు. నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలించానని చెబుతున్న కిరణ్ సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు అవసరమైన డబ్బెక్కడి నుంచి తెస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ ఆవేశంతో ఆత్రంగా వచ్చిన రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయన్నారు. ఇదే విషయాన్ని గత చరిత్ర చెబుతోందన్నారు.

తనకు కావాల్సిన వ్యక్తుల ప్రాబల్యం, ఉనికి నిలబెట్టుకోవడానికి ప్రభుత్వాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా చేయడంలో మాత్రం కిరణ్ సఫలీకృతులయ్యారని మండిపడ్డారు. తన పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును తానే పూర్తిగా భరిస్తానని చెబుతున్న కిరణ్ తనకు దూరమైన నాయకులను ఆకట్టుకోవడానికి తంటాలు పడుతున్నారన్నా రు.
పవన్ చీల్చేది కాంగ్రెస్ ఓట్లే: కోట్ల
కిరణ్, పవన్ కళ్యాణ్ పార్టీల వల్ల చీలేది కాంగ్రెస్ ఓట్లేనని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవడం కష్టమేనని, అన్ని ఎన్నికలు ఒకేసారి రావడంతో నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications