టిడిపిలోకి రేపోమాపో గల్లా జయదేవ్, 8న గంటా

Galla Jayadev and Ghant to join in TDP
గుంటూరు/ విశాఖపట్నం: తాజా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ నాలుగైదు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అదే విధంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వచ్చే నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

గుంటూరు నగరంలో శుక్రవారం గల్లా జయదేవ్ భారీ కటౌట్లు వెలిశాయి. మరో ముందడుగు పేరుతో నగరంలో ఆయన కటౌట్లు ఏర్పాటయ్యాయి. అమరా రాజ్ గ్రూప్ మేనిజింగ్ డైరక్టర్‌గా వున్న ఆయన త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఈ నెల 24 లేదా 27 తేదీలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

ఇదిలావంటే, కాంగ్రెస్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆనయ వచ్చే నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తాను టిడిపిలో చేరే విషయంపై ఆయన శుక్రవారం తన నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా నేతలతో, తెలుగుదేశం పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీని వీడి, తన సొంత గూటికి చేరుకుంటారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆయన మంత్రి పదవి చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+