రాజకీయంపై చెప్తా: హీరో కృష్ణ ఇలాకాలో గల్లా జయదేవ్

గుంటూరు జిల్లాకు చెందిన ఆచార్య ఎన్జీ రంగారావుతో పాటు తన తాతయ్య ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్లతో వేసవి సెలవులలో గడిపినట్లు ఆయన చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన సినీ నటుడు కృష్ణ కుమార్తెను తాను వివాహం చేసుకోవడంతో జిల్లాతో సంబంధాలు మరింత ఎక్కువ అయ్యాయన్నారు.
కాగా, గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన గుంటూరు లోకసభ స్థానం నుండి టిడిపి తరఫున వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వంపై టిడిపి నిర్ణయానికి వచ్చిందట.
గల్లా జయదేవ్ ఈ నెల 26వ తేదీ తర్వాత టిడిపిలో చేరే అవకాశాలున్నాయి. గుంటూరు లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలనుంటున్న జయదేవ్ ఇప్పటికే జిల్లాలోని టిడిపి నేతలతో మాట్లాడుతున్నారట. నటుడు కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం కేంద్రంగా జయదేవ్ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారట.












Click it and Unblock the Notifications