పవన్ మిత్రుడే, కానీ! మహేష్‌కు ఆ ఆలోచన లేదు: గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీ పెట్టి జనంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా, మరో ప్రముఖ నటుడు మహేష్ బాబు కూడా రాజకీయాల్లోకి వస్తారా? అనే అంశం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. అయితే, టీడీపీ ఎంపీ గల్ల జయదేవ్ ఈ విషయంపై స్పష్టతనిచ్చేశారు.

పవన్ ఆలోచన మంచిదే..

పవన్ ఆలోచన మంచిదే..

‘ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ పని చేసినప్పటి నుంచి ఆయనను తాను గమనిస్తూనే ఉన్నానని... ఆయన ఆలోచనా విధానం మంచిది' అని సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

పవన్ స్టాండ్ ఏంటో..

పవన్ స్టాండ్ ఏంటో..

సమాజ అభివృద్ధి కోసం పవన్ పరితపిస్తుంటారని చెప్పారు. అయితే, ఆయన పొలిటికల్ స్టాండ్ ఏంటనేది మాత్రం తనకు అర్థం కావడం లేదని గల్లా జయదేవ్ తెలిపారు.

టీడీపీ మిత్రుడిగానే..

టీడీపీ మిత్రుడిగానే..

అయితే, ఇప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ను టీడీపీ మిత్రుడిగానే భావిస్తోందని జయదేవ్ తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని గల్లా జయవదేవ్ చెప్పారు.

మహేష్‌కు ఆ ఆలోచన లేదు

మహేష్‌కు ఆ ఆలోచన లేదు

మహేష్ బాబుకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమాత్రం లేదని తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం అందించే సహకారాన్ని బట్టే బీజేపీతో టీడీపీ పొత్తు ఆధారపడి ఉంటుందని జయదేవ్ స్పష్టం చేశారు. రాజకీయ సంబంధాలు కేవలం పరస్పర సహకారంపైనే కొనసాగుతాయని గల్లా జయదేవ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+