బాబు ప్రమాణానికి ఏర్పాట్లు: గల్లా భూమి పూజ

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారంనాడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల స్థలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన గల్లా జయదేవ్ మంగళవారంనాడు అక్కడ భూమి పూజ నిర్వహించారు.

దాదాపు 70 ఎకరాల విస్తీర్ణం గల ఈ ప్రాంతాన్ని గల్లా జయదేవ్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి వెళ్లి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా అన్ని సౌకర్యాలూ కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

Galla Jayadev performs Bhoomi puja at Chandrababu's swearing in place

పార్కింగ్ సమయంలో ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ రోజున ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్‌తో కూడా గల్లా జయదేవ్ సమావేశమయ్యారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఏయే ఏర్పాట్లు చేసిందీ కలెక్టర్ వివరించారు. ఈ చరిత్రాత్మకమైన సందర్భాన్ని చిరకాలం గుర్తుంచుకునేటట్టు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+