డాక్టర్ సోమ్లా నాయక్ అరెస్ట్ అక్రమం: ఖండించిన ఎంపీ గల్లా జయదేవ్..

డాక్టర్ సోమ్లా నాయక్ అరెస్ట్‌ను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఖండించారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్యులను నిందించడం తప్పు అని సోమ్లా నాయక్ అన్నారని గుర్తుచేశా. నిన్న గుంటూరు జిల్లా నరసరావుపేట కోవిడ్ సమీక్షలో సోమ్లా నాయక్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. కానీ విచిత్రంగా సోమ్లా నాయక్‌ను అరెస్ట్ చేయడం ఏంటీ అని గల్లా జయదేవ్ అన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోందని గల్లా జయదేవ్ అన్నారు. వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడానికి బదులుగా.. ప్రశ్నిస్తున్న వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నది అవాస్తవం అని, ఖాళీగా లేవని డాక్టర్ సోమ్లూ నాయక్ స్పష్టం చేయడంతో కలెక్టర్ శామ్యూల్ కోపం వచ్చిందని జయదేవ్ అన్నారు. బాగా మాట్లాడాలని చెప్పిన.. తాను చెప్పింది కరెక్టే అని.. చెప్పడంతో గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

galla jaydev condemns dr somla naik arrest..

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ డాక్టర్ ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీరెవరు నన్ను సస్పెండ్ చేయడానికి అంటూ డాక్టర్ సోమ్లా నాయక్ అదేస్థాయిలో బదులివ్వడంతో సమీక్ష సమావేశం రసాభాస మారిన సంగతి తెలిసిందే. దీంో కలెక్టర్ శామ్యూల్ ఆవేశానికి లోనై.. స్థానిక ఎస్సైని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఆ వీడియో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. డాక్టర్ సోమ్లా నాయక్‌ను అరెస్ట్ చేసి.. విడుదల చేశారు. ఘటనను టీడీపీ నేత నారా లోకేశ్ కూడా ఖండించారు. ఎంపీ గల్లా జయదేవ్ కూడా తప్పుపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+