నైజీరియా నుండి వచ్చిన వ్యక్తికి ఎబోలా లేదు, డాక్టర్స్ సహా భయపడ్డారు

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి ఎబోలా లేదని, ఢిల్లీకి పంపిన రక్త పరీక్షల్లో ఎబోలా కాదని నిర్ధారణ అయ్యిందని గాంధీ సూపరింటెండెంట్ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.

గత నెల 21న నైజీరియా నుంచి ముంబై వచ్చిన అతన్ని విమానాశ్రయంలో థర్మల్ స్కానర్ ద్వారా చెకప్ చెయ్యగా, ఎలాంటి జ్వరంగాని ఇతరత్రా విషయాలుగాని బయట పడకపోవడంతో ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. మూడురోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ గత నెల 24న జ్వరం, వంటినొప్పుల లక్షణాలు కనిపించడంతో ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

చికిత్సపొందుతున్న తరుణంలో కడుపు ఉబ్బడం, యూరిన్ రాకపోవడం వంటివి జరగడంతో డాక్టర్లు కేర్ క్లినిక్స్‌కు పంపించారు. కేర్ క్లినిక్ ఇంఛార్జ్ అతనిలో అరుదైన వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని, తక్షణమే గాంధీ ఆసుపత్రిలో చేరాలని సూచించారు.

Gandhi hospital declares Nigeria returned patient Ebola-free

సోమవారం సాయంత్రం శ్రీనివాస్ ప్రసాద్‌కు గాంధీ ఆస్ప్రతి 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్లి రాష్ట్ర ర్యాపిడ్ రెస్క్యూ టీం బృందం డాక్టర్లు వైరాలజీ విభాగం ఇన్‌చార్జి నర్సింహులు, మైక్రోబయాలజిస్ట్ సత్యమూర్తి, ఎప్డిమాలజిస్ట్ వినోద్ కలసి పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్‌మెంట్ వేసుకుని అతనికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.

రోగి రక్తం, సిరా నమూనాలను తీసి ప్రత్యేకమైన ప్యాక్‌లో రాత్రి 12 గంటల సమయంలో ఎయిర్ కార్గో ద్వారా ఢిల్లీలోని బయోసెఫ్టీవాల్ 3, 4 ల్యాబ్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ల్యాబ్ (ఎన్‌సిడిసి)కి పంపించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రక్త సిరా నమూనాలు ల్యాబ్‌కు చేరినట్టు సమాచారం వచ్చిందని డాక్టర్లు తెలిపారు.

సాయంత్రం ఆ నమూనాల ప్రకారం రోగికి ఎబోలా వ్యాధి లేదని, నెగటివ్ అని రిజల్ట్ వచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ సెంటర్‌లో ఇద్దరు సిస్టర్స్‌ను ఏర్పాటు చేశామని అతని భార్యను కూడా అక్కడే ఉంచామని, వారిని బయటకు పంపించకుండా ఉంచామని గాంధీ సూపరింటెండెంట్ తెలిపారు.

ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నాడని, మాట్లాడుతున్నాడని రాష్ట్ర నోడల్ అధికారులతో ఫోన్‌లో స్వయంగా మాట్లాడారని డాక్టర్లు చెప్పారు. శ్రీనివాస్ ప్రసాద్‌కు ఎబోలా లక్షణాలు కనిపించడం లేదని, కాని మరో ప్రత్యేకమైన వైరస్ సోకిందని భావిస్తున్నట్లు తెలిపారు.

నైజీరియాను అక్టోబర్ 19న ఎబోలా ఫ్రీ దేశంగా ప్రకటించారని, ఇతను నవంబర్ 21న వచ్చారని, ఎయిర్‌కార్గోలో వచ్చేటప్పుడు ఇతర దేశాలు వారు ఉండటం వల్ల రావచ్చని డాక్టర్లు అంటున్నారు.

ఇదిలా ఉండగా, రిపోర్ట్ రాకముందు గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వైరస్ సోకిందని భావించిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడనే విషయం తెలుసుకున్న ప్రజలు, రోగులు, డాక్టర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వైద్యులు సైతం భయాందోళన చెందుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+