భక్తుల సందడి: సాగర్‌వద్ద నిమజ్జనం చూద్దాం!(పిక్చర్స్)
హైదరాబాద్: నగరం, శివారులో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నింటితో పాటు ఖైరతాబాద్ మహగణనాథుడు నేడు అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలనున్నాడు. గతంలో లాగా ఏకదంతునికి ఇరువైపులా ఉన్న విగ్రహాలతో కాకుండా ఒంటరిగానే గణపతిని నిమజ్జనం చేయనున్నారు.
గణనాథునికి ఇరువైపులా ఉన్న శ్రీరామపట్టాభిషేకం, భువనేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను యాదగిరిగుట్టలోని లోటస్ ఆలయానికి తరలించనునన్నారు. 10వ రోజే అనంత చతుర్దశి రావడంతో బుధవారమే నిమజ్జనం నిర్వహించనున్నామని తెలిపారు. గౌరి పుత్రుని నిమజ్జన ఏర్పాట్లను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి శరవేగంగా కొనసాగిస్తోంది.
నిమజ్జనానికి తరలే రూట్‌మ్యాప్‌ను పోలీసులు సిద్ధం చేశారు. భారీ వాహనం నిమజ్జనానికి తరలివెళుతున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో గుర్తించేందుకు మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ట్రైల్న్ నిర్వహించారు. విద్యుత్ శాఖతో పాటు వివిధ శాఖల సమన్వయంతో వాహన రూట్‌లో ఉన్న వైర్లను తొలగించారు. నగరంలో గణేష్ నిమజ్జన భద్రత కోసం 15000 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు.

ఖైరతాబాద్ 1
ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు వచ్చి భక్త జనం. ఈ రోజు ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. దీంతో చాలామంది భక్తులు చూసేందుకు వచ్చారు.

ఖైరతాబాద్ 2
ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు వచ్చి భక్త జనం. ఈ రోజు ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. దీంతో భక్తులు చూసేందుకు తరలి వచ్చారు.

ఖైరతాబాద్ 3
ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు వచ్చి భక్త జనం. ఈ రోజు ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. దీంతో భక్తులు చూసేందుకు తరలి వచ్చారు.

గణేషుడు
ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేషుడు కొలువుదీరిన దృశ్యం. ఆయనకు ఓ వైపు భువనేశ్వరి మాత, మరో వైపు శ్రీరామ పట్టాభిషేకం దృశ్యాన్ని ఏర్పాటు చేశారు.

భక్త సందోహం
భారీ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. మంగళవారం తరలి వచ్చిన భక్తులు.

నిమజ్జనం 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద వినాయక నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేసిన దృశ్యం.

ఏర్పాట్లు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద వినాయక నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

పహారా
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద వినాయక నిమజ్జనం కోసం పోలీసుల భద్రత ఏర్పాట్ల దృశ్యం.

క్రేన్స్
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) వద్ద నగరంలో తొమ్మిది రోజులు పూజలందుకున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్స్‌ను సిద్ధంగా ఉంచిన దృశ్యం.

నిమజ్జనం కోసం తరలింపు
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణేషుడిని నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో తరలి వెళ్తున్న దృశ్యం.

నిమజ్జనం చూద్దాం!
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణేషుడిని నిమజ్జనం చేస్తున్న సమయంలో ఆసక్తిగా చూస్తున్న పలువురు భక్తులు.

విహంగ వీక్షణం
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో తొమ్మిది రోజులు పూజలందుకున్న వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన దృశ్యం.












Click it and Unblock the Notifications