విశాఖలో రికార్డ్: గణేష్ లడ్డు 12.75లక్షలు, సాయానికే
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గణేషుడి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. విశాఖలోని మురళీ నగర్‌లో గల విజయ గణపతి లడ్డూ వేలంలో రూ.12.75 లక్షలు పలికింది. వేలంలో వచ్చిన డబ్బును చిన్నపిల్లల గుండె చికిత్స కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇస్తామని వినాయక మండప నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాదులోని నేరేడ్‌మెట్‌లో గణేష్ లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికిన విషయం తెలిసిందే. వెస్ట్ దీనదయాల్ నగర్ వినాయకుడి లడ్డూనూ రూ.11.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ ధర కంటే రెండు లక్షలకు పైగా అధిక రేటు పలికింది.

బాలాపూర్ లడ్డూ రూ.9.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే. సింగిరెడ్డి జయేందర్ రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గుంటూరులోని మిర్చి యార్డు గణేష్ లడ్డూను రూ.2.75 లక్షలకు యలమంచిలి పుల్లారావు దక్కించుకున్నారు.
నిమజ్జనానికి తరలివెళ్లడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. మరికొన్ని గంటల్లో ఈ భారీ గణనాథుని తరలించనున్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా వినాయకుడిపై పూలవాన కురిపించబోతోంది. దీనిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ తరలివస్తున్నారు. ఇప్పటికే వినాయకుడిని నెలకొల్పిన ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
ఉగాదికి ముందు ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై మంత్రి శుభవార్త! -
రైతుబజార్ కూరలు ఇక ఇంటికే, ఇలా చేస్తే చాలు- అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!! -
బ్యాంకులు, ఆఫీసులు, విద్యా సంస్థలకు పండుగ సెలవులు - ఎవరికి ఎప్పుడెప్పుడు..!! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications