విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ యత్నం;బ్లాక్ మెయిల్...ఆలస్యంగా వెలుగులోకి:నిందితులు అరెస్టు
విజయవాడ:సోషల్ మీడియా పరిచయాలను అడ్డు పెట్టుకొని మహిళలను దారుణంగా మోసగిస్తున్న ఉదంతాలు ఎన్ని వెలుగు చూస్తున్నా ఇంకా అమాయకత్వంతోనో, అవగాహన లేకో యువతులు మోసపోతూనే ఉన్నారు.
తాజాగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఇటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. ఫేస్ బుక్ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని విద్యార్థిని హోటల్ కు తీసుకెళ్లిన ఒక యువకుడు తన స్నేహితులతో కలసి ఆమెపై గ్యాంగ్ రేప్ యత్నం చేయడంతో పాటు...ఆ దృశ్యాలను వీడియోతీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...

మైలవరంలోని ఓ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థినికి ఇబ్రహీంపట్నంకు చెందిన మణికంఠ అనే యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మణికంఠ ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి, స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ లో తాను బుక్ చేసిన రూమ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ యువతిని బెదిరించి మణికంఠ తన స్నేహితుడు ధీరజ్, భాషతో కలిసి అత్యాచారం యత్నం చేశాడు. పైగా ఆ అత్యాచార యత్నం దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు.
ఈ క్రమంలో ఆ యువతి అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని బైటపడింది. అనంతరం ఈ దృశ్యాలను సెల్ లో చిత్రీకరించిన వ్యక్తులు వారి గ్రూప్ లోని మరో వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. ఈ వీడియోను ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోలోని కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
దీంతో ఆ వీడియోలోని యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులు మణికంట, ధీరజ్, భాష లను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, మణికంఠ అనే స్నేహితుడితో లాడ్జికి తాను వెళ్లానని, అక్కడ అతని స్నేహితులు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు ఫిర్యాదు సందర్భంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు నిందితులపై అత్యాచారయత్నం అభియోగాల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
-
సరదా తీరకముందే విషాదం: 10 మంది స్నేహితులు.. ఒకే కారు! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications