తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్: గంగా పుష్కరాలకు ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: పవిత్ర గంగా నది పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్న తెలుగ ప్రయాణికులకు శుభవార్త. గంగానది పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ఒక ప్రత్యేక రైలు నడపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
ఏప్రిల్ 22 నుంచి మే 5 వరకు జరిగే గంగా పుష్కరాల కోసం సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ఆయా ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, గమ్యస్థానల వివరాలను పేర్కొంటూ.. అధికారిక ప్రకటనను సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసింది. ఏప్రిల్ 23, 30, మే 7 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా తిరుపతి, ప్రయాగ్ రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వరకు మరో ప్రత్యేక రైలు, గుంటూరు, ప్రయాగ్ రాజ్ మీదుగా బెనరస్ వరకు ఇంకో రైలు నడపనున్నట్లు పేర్కొంది.

సికింద్రాబాద్(07007) నుంచి..
ఏప్రిల్ 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా రక్సోల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 30, మే 7 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్‌కి ప్రతి ఆదివారం రాత్రి 10:30 నిముషాలకు ప్రారంభమవుతుంది.
తిరుపతి నుంచి దానాపూర్(07419)కు..
సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకు నడిచే ప్రత్యేక రైలు మాదిరిగానే తిరుపతి నుంచి దానాపూర్‌కి కూడా మరో స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా దానాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 22, 29 అలాగే, 06 మే తేదీలలో తిరుపతి నుంచి ప్రారంభమవుతుంది.
గుంటూరు నుంచి బెనారస్(07230) వరకు..
గంగా పుష్కరాలకు వెళ్లే వారి కోసం గుంటూరు నుంచి కూడా ప్రత్యేక రైలు ఉంది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు వెళ్తుంది. ఏప్రిల్ 22, 29 అలాగే, 06 మే తేదీలలో ఇది నడుస్తుంది. కాగా, ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలు ఏప్రిల్ 22న ప్రారంభమై.. మే 3న ముగుస్తాయి. గంగానది పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ ప్రజలు పుష్కరఘాట్లకు లక్షలాదిగా తరలివస్తారు.












Click it and Unblock the Notifications