Pushpa2: అల్లు అర్జున్ సారీ చెప్పకపోతే పుష్ప 2 అడ్డుకుంటాం-జనసేన నేత అల్టిమేటం..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రేపు రాత్రి తొమ్మిదిన్నరకు పడే బెనిఫిట్ షోతో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఓవైపు ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటుండగా.. మరోవైపు నిన్న హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో జనసేన నేతలు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ కు ఆయన అల్టిమేటం ఇచ్చారు. అల్లు అర్జున్ రేపటిలోగా చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,నాగబాబుకు క్షమాపణలు చెప్పాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు. లేకుంటే పుష్ప 2 చిత్రాన్ని జన సైనికులు, మెగా అభిమానులు అడ్డుకుంటామన్నారు.

అల్లు అర్జున్ కు మదమెక్కి, అహంతో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని జనసేన నాయకుడు చలమలశెట్టి రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించారని, ఇప్పుడు తాము సైలెంట్ గా ఉండలేమని తెలిపారు. పద్ధతి మార్చుకోవాలని అల్లు అర్జున్ కు ఆయన సూచించారు.
అల్లు అర్జున్ కు గతంలోనే తాము అల్టిమేటం ఇచ్చామని, కానీ ఆయన పోకడ మెగా ఫ్యామిలీకి, జనసైనికులకు చాలా బాధ కలిగించిందని రమేశ్ బాబు తెలిపారు. తొలి నుంచీ మెగా ఫ్యామిలీ అభిమాని అని, తాను అక్కడే పెరిగానని, చిరంజీవి అడుగు జాడల్లో నడుస్తానని చెప్పి ఇప్పుడు వారి ప్రస్తావన చేయకపోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications