అచ్చెన్నాయుడు కాళ్లు పట్టుకున్నాడు..?
'పార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు అని, ఆయన ఓ మహిళా అధికారిపై అసభ్యంగా ప్రవర్తించారని చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని వంశీ వ్యాఖ్యానించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును టార్గెట్ చేశారు. అచ్చెన్నాయుడు ఓ సమయంలో.. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ విషయం పెద్దదైందని, ఆ సమయంలో అచ్చెన్నాయుడు చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని.. తన జోలికి వస్తే.. అందరి చిట్టా విప్పుతానని వల్లభనేని వంశీ టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.
'పార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు అని, ఆయన ఓ మహిళా అధికారిపై అసభ్యంగా ప్రవర్తించారని చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని వంశీ వ్యాఖ్యానించారు. నా గురించి అచ్చెన్నాయుడు మాట్లాడితే.. తాను అందరి చిట్టా విప్పుతానన్నారు. చంద్రబాబు బహిరంగ లేఖపైనా వల్లభనేని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడికి అధికారం దక్కలేదని తమ కులానికి చెందిన పత్రికలు బాధలో ఉన్నాయని, అందుకే గోబెల్స్ తరహాలో ప్రచారం చేస్తున్నాయని మండిడ్డారు. చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం ఉండదని, డబ్బు కోసం చంద్రబాబు పదవులు అమ్ముకున్నాడని, ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండేది తమ నాయకుడు జగన్ ఒక్కడే అని స్పష్టం చేశారు. బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారని చెప్పారు.

గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి జరగడానికి ముందు ఉదయం సమయంలోనే ఎమ్మెల్యే వంశీ టీడీపీ కార్యాలయం చుట్టూ కారులో రెక్కీ నిర్వహించారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. దాడికి సంబంధించి వంశీ మాట్లాడుతూ దాడులు తాను మొదలుపెట్టలేదని, ఎవరో రెచ్చగొట్టడంవల్లే తన అనుచరులు దాడులు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తులవల్లే వివాదాలు రాజుకుంటున్నాయని, స్థానికంగా ఉండే నాయకులు తనతో సఖ్యతగానే ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications