Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంటాపై అయ్యన్న తీవ్రవ్యాఖ్య: సోనియా తప్పఅని కాసు

Ganta Srinivas Rao
హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాస రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. గంటాది ఐరన్ లెగ్ అని, ఐదేళ్లలో ఇప్పటికే మూడు పార్టీలు మారారని విమర్శించారు.

గంటా సహా పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ పార్టీలోకి వస్తారనేది కేవలం ఊహాగానమే అన్నారు. దొంగలు టిడిపిలోకి వస్తే తమ పార్టీకి నష్టమన్నారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా విలువలు, నిబద్ధత చూశాకే చేర్చుకుంటామని అయ్యన్న పాత్రుడు అన్నారు.

గంటా ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీ నాశనం అవుతోందన్నారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు కాంగ్రెసు పార్టీలు బలహీనపడ్డాయన్నారు.

సోనియా తప్ప: కాసు

తాను ఏఐసిసి సభ్యుడినని, తనపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తప్ప ఎవరూ చర్యలు తీసుకోలేరని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి వేరుగా అన్నారు. రేపటి కేబినెట్ సమావేశం సజావుగానే సాగుతుందని చెప్పారు.

కేంద్రంలో యూపిఏ అధికారంలోకి రావడానికి ఆంధ్ర ప్రదేశ్ కారణమన్నారు. ఇక్కడి నుండి ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నామన్నారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోను జరగదన్నారు. రాయల తెలంగాణకు సీమ ప్రజలు ఒప్పుకోరన్నారు. రాయల తెలంగాణ సరికాదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+