టిడిపితో మంత్రి గంటా రహస్య మంతనాలు, బుజ్జగింపు

టిడిపిలో చేరిక పైన గంటా ఏం చెప్పినప్పటికీ టిడిపి నేతలతో ఆయన రహస్య మంతనాలు జరుపుతున్నారంటున్నారు. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీ అభిప్రాయాన్ని 23లోగా చెప్పాలని రాష్ట్రపతి సూచించారు.
23వ తేదీ తర్వాత సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ నుండి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ కోసం పలువురు వేచి చూస్తున్నారు. ఆయన పార్టీ పెట్టేందుకు ఆసక్తి కనబర్చడం లేదనే అభిప్రాయంతో పలువురు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైపు చూస్తున్నారు.
అందులో గంటా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టిడిపిలో చేరేందుకు గంటా తన అనుచరులతో సమాలోచనలు జరపడంతో పాటు, టిడిపి నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారట. గంటా రాకను వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే చర్యల్లో జిల్లా నాయకులు పడ్డారట. గంటా ఈ నెల 23వ తేదీ తర్వాత టిడిపిలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఆయనతో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా చేరనున్నారట.












Click it and Unblock the Notifications