పవన్ కళ్యాణ్ ఏం సాధించావ్, నీ వైఖరి ఏమిటో చెప్పు: గంటా విమర్శలు
అమరావతి: ధవళేశ్వరం బ్యారేజీ పైన భారీ కవాతు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం విమర్శలు గుప్పించారు. ఈ కవాతు ద్వారా ఆయన ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు.
తాను ప్రజా సమస్యలపై గర్జించేందుకు, సమస్యలపై పోరాడేందుకే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, కానీ కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే ఆయన ఎందుకు గర్జించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఎవరో చెప్పింది విని మాట్లాడటం సరికాదని జనసేనానికి ఆయన సూచనలు చేశారు.

ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని గంటా శ్రీనివాస రావు అన్నారు. ప్రజా సేవ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరో కాగితాలు ఇస్తే చదవడం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అన్యాయం చేస్తోందని, దానిపై నిలదీయాలని సూచించారు.












Click it and Unblock the Notifications