విశాఖ పేరును నాశనం చేస్తున్నారు, ఎవరినీ వదలం: మంత్రి గంటా
విశాఖ భూ కుంభకోణంలో ఎంతటివారున్నా వదిలేది లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పేరును నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
విజయనగరం: విశాఖ భూ కుంభకోణంలో ఎంతటివారున్నా వదిలేది లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పేరును నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
భూ కుంభకోణాలపై నేరుగా సీఎం స్పందించారని మంత్రి అన్నారు. అలాగే రెవెన్యూ మంత్రి విశాఖ వచ్చి దర్యాప్తు చేస్తారని, భూ కుంభకోణాల సూత్రధారి శంకర్రావు ఆస్తులపై ఏసీబీ దాడులకు, ఈ భూకుంభకోణానికి సంబంధం లేదని మంత్రి అన్నారు.

కాగా, విశాఖ భూకుంభకోణంలో కీలకసూత్రధారిగా చెబుతున్న శంకర రావు ఆస్తులపై బుధవారం నాడు ఏసీబీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర ఆరుచోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications