యూట్యూబర్ అన్వేష్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన గరికపాటి ..!
నోరు ఉంది కదా అని సమయం, సందర్భం, వేదిక చూసుకోకుండా.. ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయం మాత్రం ఇటీవల కాలంలో చాలా బాగా అర్ధం అవుతోంది. నటుడు శివాజీ "దండోరా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆ కామెంట్స్ పై సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ రియాక్ట్ అవ్వడం.. మహిళా కమిషన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. విమర్శలు పెరగడంతో శివాజీ క్షమాపణ చెప్పినా కూడా వివాదం మాత్రం సర్దుమనగడం లేదు.
అయితే ఒక వర్గం శివాజీ వ్యాఖ్యలపై మండిపడుతుంటే.. మరో వర్గం మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ప్రముఖ ప్రవచన కర్త, గరికపాటి నరసింహారావుపై, హిందూ దేవతలపై మాట్లాడిన మాటలు తీవ్ర వివాదానికి తెరలేపాయి. అంతే కాకుండా పుచ్చకాయ, కీరదోసలతో ఉదాహరణలు చెప్తూ సీతాదేవిని, ద్రౌపదిని కించపరిచేలా వాడిన పదాలు అన్వేష్ మెడకు చుట్టుకున్నాయి.

దాంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా అన్వేష్‌పై విరుచుకుపడింది. సదరు యూట్యూబర్ కి భారీ షాక్ ఇస్తూ.. ఫాలోవర్స్ సైతం భారీగా ఆన్ సబ్ స్క్రయిబ్ చేసుకున్నారు. దీంతో అన్వేష్ ఇటీవల క్షమాపణలు సైతం చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ వివాదంపై గరికపాటి నరసింహారావు పరోక్షంగా స్పందించిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.
గరికపాటి స్ట్రాంగ్ కౌంటర్..
ఈ మేరకు గరికపాటి మాట్లాడుతూ.. ఒక నేరస్థుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు కానీ.. పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. నువ్వు చేసింది ఏంటి ? మొహం మీద ఉమ్మేస్తాం అని అనగలగాలి. లేకపోతే ఏ మచ్చ లేని వాళ్ల మీద బురద జల్లుతున్నారు. వ్యక్తిత్వాలను ఖూనీ చేసే విధంగా చేస్తున్నారు. మనం సహిస్తూ ఉంటాం.. మనకు ఎందుకులే అనుకుంటాం అని అన్నారు.
అంతే కాకుండా సందర్భం వచ్చింది కాబట్టి మొహమాటం లేకుండా చెబుతున్నా.. నా విషయంలో అభిమానులు మాత్రం ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు. హాయిగా, శుబ్బరంగా పెడుతున్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్లు పారిపోయేలా పెడుతున్నారు. సోషల్ మీడియాలోనూ మనదే పైచేయి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో గరికపాటి పరోక్షం గానే అన్వేష్ పేరు చెప్పకుండా ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చేశారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications