తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీలతో భయాందోళనలో స్థానికులు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. రెండో రోజు మరోచోట గ్యాస్ లీకయింది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం తూర్పుపాలెంలో లీక్ కాగా, మంగళవారం గొల్లపాలెంలో గ్యాస్ లీకయింది.
ఓన్జీసీ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొల్లపాలెంలో గ్యాస్ ఎగిసిపడుతోంది. మలికిపురం మండలం తూర్పుపాలెంలోని ఓఎన్జీసీ జీజీఎస్ పరిధిలో గ్యాస్ పైపులైన్ లీకేజీ సోమవారం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.

స్థానిక కొబ్బరితోటలో విస్తరించిన పైపులైనుకు రంధ్రం ఏర్పడి గ్యాస్ పెద్ద ఎత్తున లీకయింది. స్థానికులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారమివ్వడంతో అధికారులు వెంటనే పైపులైనుకి గ్యాసు సరఫరాను నిలిపివేసి లీకేజిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications