కాకినాడలో గ్యాస్ లీకేజీ
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామ పరిధిలోని నెక్కంటి సీ ఫుడ్స్ పరిశ్రమలో బుధవారం ఉదయం మరోసారి గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో అందులో పని చేస్తున్న 50మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బాధితులను కాకినాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఇదే పరిశ్రమలో గ్యాస్ లీకై 28మంది అస్వస్థతకు గురయ్యారు. అయినా పరిశ్రమ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications