వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు వేల కాల్ మ‌నీ కేసులు..దృష్టి పెడ‌తాం: నేర ర‌హిత రాష్ట్రంగా చేస్తాం:స‌వాంగ్ బాధ్య‌త‌ల స్వీక‌రణ

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న డీజీపీగా గౌతం స‌వాంగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డీజీపీగా స‌వాంగ్‌ను ఎంపిక చేసారు. ముఖ్య‌మంత్రి త‌న మీద న‌మ్మ‌కంతో బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని..ఆయ‌న ఆశయాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తాన‌ని స‌వాంగ్ స్ప‌ష్టం చేసారు. కాల్‌మ‌నీ కేసుల‌పైన దృష్టి పెడ‌తామ‌ని..రెండు వేల కేసులు న‌మోద‌య్యాయ‌ని వివ‌రించారు. మ‌హిళ‌ల పైన నేరాల‌ను పూర్తి స్థాయిలో నియంత్రిస్తామ‌ని వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రి ఆశ‌యాల మేర‌కు..
ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆశ‌యాల మేర‌కు తాము పని చేస్తామ‌ని నూత‌న డీజీపీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన గౌతం స‌వాంగ్ స్ప‌ష్టం చేసారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని..ఎక్కువ‌గా మ‌హిళ‌లు..చిన్న పిల్ల‌ల మీద నేరాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్యక్తం చేసారు.

Gautam Sawang taken charge as New DGP of AP. Sawang says he want to develop AP as crime free state

నేర రహిత రాష్ట్రంగా ఏపీని చేసేవిధంగా పోలీస్ డిపార్ట్ మెంట్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లుగా ఏపీ పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నార‌న్నారు. గత కొన్నెళ్లుగా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి.. వాటిని కంట్రోల్‌లోకి తెచ్చేందుకు టెక్నాలజీ మరింత డెవలెప్ చేయబోతున్నామ‌ని సవాంగ్ చెప్పుకొచ్చారు.

కాల్‌మనీ కేసులపై దృష్టి సారిస్తాం..
రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన కాల్ మ‌నీ కేసుల‌ను అప్ప‌ట్లో విజ‌య‌వాడ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా స‌వాంగ్ విచారించారు. డీజీపీగా ఆయ‌న వీటి పైన స్పందించారు. విజయవాడలో 2వేల కాల్‌మనీ కేసులు సెల్‌కు వచ్చాయని... ప్రతి కేసు డిఫరెంట్‌గా ఉందన్నారు. కాల్‌మనీలో చాలా కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని... కాల్‌మనీ కేసుల పరిష్కారంలో బెజవాడ బార్ అసోసియేషన్ సహాకారం మరువలేనిదని చెప్పుకొచ్చారు.

ఏకపక్షంగా కొన్ని వర్గాల కోసమే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదని స్ప‌ష్టం చేసారు. అందరూ సమానమేనని సీఎం జగన్ చెప్పిన మాట అదే అని గుర్తు చేసారు. అంతేకాకుండా పోలీసుల ఆరోగ్యంపై దృష్టి పెట్టామ‌ని.. హెల్త్ స్కీమ్‌ను ఇంకా ఇంప్రూవ్ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్, క్రికెట్ బెట్టింగ్స్ చేసే బుకీలపై దృష్టి పెడతామ‌న్నారు. సోషల్ మీడియా అనేది విస్తృతమై న నెట్ వర్క్ అంటూ.. వాటిలో వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రత్యేక దృష్టిపెడతామ‌ని సవాంగ్ వివ‌రించారు.

English summary
Gautam Sawang taken charge as New DGP of AP. Sawang says he want to develop AP as crime free state. He said 2000 call money cases filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X