వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమ‌ల పై పండితుల ఎఫెక్ట్: భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణం..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌తీ ఏడాది నూత‌న సంవ‌త్స‌ర ప్రారంభ రోజున తిరుమ‌ల ప్ర‌ముఖులు..భ‌క్తుల తో కిక్కిరిసి పోతుంది. అటువంటి తిరుమ ల లో ఈ సారి ర‌ద్దీ సాధార‌ణంగా క‌నిపిస్తోంది. ప్ర‌ముఖ‌లు తాకిడి త‌గ్గింది. అధికారులు అన్ని ర‌కాలుగా ఏర్ప‌ట్లు చేసిన‌ప్ప టికీ...కొంద‌రు పండితుల ప్ర‌వ‌చ‌ణాలు సాధారణ భ‌క్తుల మీద ప్ర‌భావం ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది..

తిరుమ‌ల

తిరుమ‌ల

నూతన సంవత్సర వేడుకలకు తిరుమల శ్రీవారి ఆలయం ఘనంగా ముస్తాబైంది. ఆలయ ప్రాకారం, గోపురాలు, ధ్వజ స్తంభం, అంతరాలయాలను పూలు, విద్యుద్దీపాలతో టీటీడీ సిబ్బంది అందంగా అలంకరించింది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సోమవారం అర్ధరాత్రి స్వామివారికి తిరుప్పావై పఠనం అనంతరం ఇతర కైంకర్యాలు పూర్తిచేసి.. మంగళవారం వేకువజామున 1.30 గంటల నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ప్రారంభించింది. వేకువజామున 4.30 గంటల నుంచి ధర్మదర్శనాన్ని మొదలుబెట్టి అర్ధరాత్రి వరకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించాల‌ని నిర్ణ‌యించింది. నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభం రోజున తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, బాలీవుడ్ నటుడు బోనీకపూర్‌ కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు.

పండితుల ఎఫెక్ట్ ప‌డిందా..

పండితుల ఎఫెక్ట్ ప‌డిందా..

సాధార‌ణంగా జ‌న‌వ‌రి 1న భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయే తిరుమ‌ల గిరులు సాధార‌ణంగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. జ‌న‌వ‌రి 1వ తేదీ ఆంగ్ల నామ సంవ‌త్స‌ర‌మ‌ని..ఆ రోజు కొత్త సంవ‌త్సరాది గా జ‌రుపుకోవ‌టం సాంప్ర‌దాయం కాద‌ని పలువురు పండితులు చెబుతూ వ‌చ్చారు. వీరి ప్ర‌భావం తిరుమ‌ల భ‌క్తుల మీద ప‌డిన‌ట్లుగా ఉంది. దీంతో..తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నూతన సంవత్సరం

నూతన సంవత్సరం

ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు అన్ని ఆర్జిత సేవలను, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అయితే, రోజులు..వారాల‌తో సంబంధం లేకుండా నిత్యం భ‌క్త కోటితో పుల‌క‌రించే శ్రీ వారి దేవాల‌యం..కొంత మేర జ‌నం త‌గ్గినా..ప్ర‌త్యేక రూపుతో మాత్రం భ‌క్తుల‌ను అల‌రిస్తోంది.

English summary
Tirumala hills seems to be no effect of Januray 1st . Devotees rush is general. But, TTD officials decorated Temple for Jan 1st as usual. Some vip's visited lord
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X