బిజెపితో పొత్తుపై గంటా తీవ్ర వ్యాఖ్యలు: తెగదెంపులకు చంద్రబాబు రెడీ
అమరావతి: బిజెపితో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మంత్రులు గంటాతో పాటు నారాయణ, పరిటాల సునీత కొల్లు రవీంద్ర, తదితరులు గురువారం బంద్‌లో పాల్గొన్నారు.
తమ తమ ప్రాంతాల్లో మంత్రులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఆమోదం ఉంటే తప్ప వీరంతా అలా చేయరనేది అందరికీ అర్థమయ్యే విషయమే. బిజెపితో తెగదెంపులకు చంద్రబాబు మానసికంగా సిద్ధపడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

పొత్తును వదులుకుంటామని గంటా
అవసరమైతే బిజెపితో పొత్తును వదులుకుంటామని గంటా శ్రీనివాస రావు అన్నారు. చంద్రబాబు తెగదెంపులకు సిద్ధపడినట్లు సంకేతాలు ఇస్తే తప్ప మంత్రి అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయరనేది స్పష్టం. మిత్రధర్మాన్ని బిజెపి కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంంపై సవతి తల్లి ప్రేమ
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని గంటా శ్రీనివాస రావు విమర్శించారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎంతో ఇచ్చిన కేంద్రం తమ రాష్ట్రానికి మాత్రం ఏమీ ఇవ్వడం లేదని ఆయన అన్నరు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు.

కేంద్రం పూర్తిగా విఫలం
విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు.

చంద్రబాబు ఇలా భావిస్తున్నారా...
రాష్ట్రానికి ఇవ్వలేదనే విమర్శలు తలెత్తిన నేపథ్యంలో బిజెపితో ఇంకా స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పుకుంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బంద్‌లో పాల్గొనాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications