ఎదుర్కున్నా కట్టడాలను కూల్చేస్తున్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రతిఘటన ఎదురైనా ఆగడం లేదు. బల్దియా అధికారులు గురువారం మరో 14 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వీటిలో సర్కిల్ 1 కాప్రాలోని అనుమతిని ఉల్లంఘించి నిర్మించిన ఓ భవనంలోని రెండో అంతస్తును కూల్చివేయగా, సర్కిల్ మూడు పాతబస్తీలోని రెండు భవనాల్లో3,4 అంతస్తులు, మరో భవనంలోని మూడో అంతస్తులను కూల్చివేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు.
సర్కిల్ నాలుగులోని యాకుత్‌పురాలో కూడా శిథిలావస్థకు చేరిన మరో భవనాన్ని అధికారులు గురువారం కూల్చివేశారు. అలాగే సర్కిల్ 7 పరిధిలోని గోల్కొండలోని బడా బజార్, జాస్మైన్‌నగర్‌లోని రెండు భవనాల్లోని మొదటి అంతస్తులను కూల్చివేశారు. వీటితో పాటు సర్కిల్ 9లోని రాంనగర్‌లో రెండు భవనాల్లోని 3,4, 2, 3 భవనాలను అధికారులు కూల్చివేసినట్లు తెలిపారు.
సర్కిల్ 10లోని మధురానగర్, బంజరాహిల్స్ రోడ్ నెం.4లోని అదనంగా నిర్మించిన రెండు అంతస్తులను, అలాగే మరో పెంటౌజ్‌ను అధికారులు కూల్చివేసినట్లు తెలిపారు. సర్కిల్ 12లో కూడా చందానగర్, మియాపూర్‌లలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ షెడ్డు, మరో భవనంలోని రెండో అంతస్తులను పోలీసుల బందోబస్తుతో కూల్చివేశారు. సర్కిల్ 14లోని సర్దార్ పాపారాయుడునగర్‌లోని ఓ భవనంలోని 3వ అంతస్తు, మరో భవనంలోని నాలుగో అంతస్తును కూల్చివేశారు.
అలాగే సర్కిల్ 15లోని గాజులరామారంలో అనుమతిని ఉల్లంఘించి, అక్రమంగా వేసిన అయిదో అంతస్తును, అలాగే సర్కిల్ 16లోని ఆల్వాల్ మారుతీనగర్‌లో రెండో అంతస్తును, ఇదే ప్రాంతంలోని మరో భవనంలోని మొదటి అంతస్తులను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు సర్కిల్ 17లో అక్రమంగా నిర్మించిన జి ప్లస్ వన్ భవనాన్ని, సర్కిల్ 18లోని ఈస్ట్‌మారెడ్‌పల్లిలోని బాల్కానీని ముందుకు నిర్మించిన భవనాన్ని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

ఎల్బీ నగర్‌లో కూల్చివేతలు
గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు గురువారంనాడు కొనసాగించారు.

కర్మన్‌ఘాట్ పరిధిలో..
కర్మన్ ఘాట్ పరిధిలోని వివిధ కాలనీల్లో అధికారులు గురువారంనాడు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

స్థానికంగా ప్రతిఘటన ఎదురైనా...
స్థానికంగా ప్రతిఘటన ఎదురైనా పోలీసుల సహకారంతో జిహెచ్ఎంసి అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు.

అడ్డుకోవడానికి యత్నం
స్థానిక నాయకులు కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. టిడిపి నేతలు కూడా వీరిలో ఉన్నారు

అదుపులోకి మాజీ కౌన్సలర్
అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ కౌన్సిలర్ వంగా మధూసూదన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫిర్యాదు చేసినా...
ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా బహుళ అంతస్థుల భవనాలను వదిలేసి ఇతర నిర్మాణాలనే ఎందుకు కూలుస్తున్నారని స్థానిక నేతలు అడిగారు.












Click it and Unblock the Notifications