రాఖీ రోజు సోదరికి ఏ బహుమతులు ఇస్తే శుభం - ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవీ..!!
రాఖీ. ఆత్మీయతకు.. అనురాగానికి ప్రతీక. రక్షాబంధనం సోదర - సోదరీ మణుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే వేడుక. రాఖీ నాడు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టటం ఆన వాయితీ. ఆ సమయంలో తన సోదరికి సోదరుడు బహుమతి ఇవ్వటంతో పాటుగా తాను అండగా నిలుస్తానని.. రక్షగా ఉంటానని వాగ్దానం చేస్తారు. దీంతో పాటుగా ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తారు. అయితే, ఈ అపురూపమైన సందర్భంలో శుభం చేసే బహుమతులు ఉన్నాయి. అదే విధంగా ఇవ్వకూడని బహుమతుల గురించి పండితులు సూచనలు చేస్తున్నారు.
అనుబంధానికి ప్రతీక
రేపు రాఖీ. ప్రతీ ఏటా శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ పండుగ చేసుకుంటారు. రాఖీకి భారతీయ సంస్కృతిలో చాలా విశిష్టత ఉంది. రాఖీ పండుగ నాడు సోదరికి సోదరుడు బహుమతులు ఇస్తాడు. అయితే పండితులు.. పురాణాల ప్రకారం కొన్ని బహుమతులు ఇవ్వటం మంచిది కాదని చెబుతున్నారు. రాఖీ నాడు ఏ ఒక్కరూ తమ సోదరికి నల్ల దుస్తులు, ఆభరణాలు బహుమతిగా ఇవ్వకూడదు. నలుపు రంగును శని, రాహువుకు చిహ్నంగా భావిస్తారు. రక్షా బంధన్ వంటి శుభదినాన నల్ల దుస్తులు లేదా నల్ల ఆభరణాలను సోదరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఇలాంటి గిఫ్టులు ఇస్తే సోదర, సోదరీమణుల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని నమ్మకం. అదే విధంగా కత్తి, కత్తెర, గోళ్ల కట్టర్ వంటివి అసలు ఇవ్వకూడదు.

ఇవ్వకూడని గిఫ్ట్ లు
వీటిని గిఫ్టులుగా ఇవ్వడం వల్ల సోదర-సోదరీమణుల సంబంధంలో అపార్థాలు, గొడవలు వచ్చి విడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక.. రుమాలు దుఃఖం, వీడ్కోలుతో ముడిపడి ఉండే వస్తువు. భారతీయ సంప్రదాయంలో రుమాలును వీడ్కోలు సమయంలో ఇస్తారు. కాబట్టి ఏదైనా శుభకార్యం లేదా వేడుకలో దీనిని ఉపయోగించకూడదని చెబుతారు. వాచ్ బహుమతిగా ఇవ్వడం వల్ల సోదర, సోదరీమణులు సంబంధాలు కొంత కాలం వరకే పరిమితమవుతాయని విశ్వసిస్తారు. ఇక.. ఇనుము, ఉక్కు వస్తువులు రాహువు, శని, అంగారక గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. వాటిని బహుమతిగా ఇవ్వడం వల్ల జీవితంలో అస్థిరత ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు. అదే సమయంలో శుభకరమైన బహుమతులను సూచిస్తున్నారు.
ఇవ్వాల్సిన బహుమతులు
వెండి వస్తువులు (నాణేలు, కంకణాలు వంటివి) ఇవ్వటం శుభకరం. వెండి చల్లదనం, చంద్రుడి తో ముడిపడి ఉంటుంది. ఇది మానసిక శాంతి, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే వెండి వస్తువులను సోదరిగా గిఫ్ట్స్ గా ఇస్తే శుభసూచికం. అదే విధంగా పసుపు రంగు జ్ఞానం, శ్రేయస్సు, అంగారక గ్రహానికి చిహ్నంగా ఉంటుంది. అలాగే తెలుపు రంగు స్వచ్ఛత, సమతుల్యతకు చిహ్నంగా భావిస్తారు. రుద్రాక్ష, తులసి మాల, పూజ కిట్ వంటి మతపరమైన వస్తువులను కూడా సోదరికి సోదరుడు బహుమతిగా ఇవ్వవచ్చుని సూచిస్తున్నారు. ఇవి జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. సోదరి పుస్తకాలు ఇవ్వడం వల్ల జ్ఞానం పెరగడమే కాకుండా, ఆప్యాయతకు శాశ్వత చిహ్నంగా కూడా మారుతుంది. రాఖీ నాడు ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువు కాదు. అది ఆప్యాయత, ఆశీర్వాదానికి చిహ్నం. దీనికి అనుగుణంగా సెంటిమెంట్, సంప్రదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బహుమతి ఇవ్వట ద్వారా చిరకాలం గుర్తుండిపోతుంది.












Click it and Unblock the Notifications