హిందూపురం లాడ్జి ఘటనలో షాకింగ్: తల్లితో అఫైర్, కూతురుపై కన్నేశాడు

అనంతపురం: ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆమె కూతురు పైన కన్నేసిన కామాంధుడు అది కాస్తా బెడిసి కొట్టడంతో ఉన్మాదిగా మారాడు. తల్లిని చంపేసి, కూతురిని హింసించాడు. కూతురును కూడా చంపేందుకు ప్రయత్నిస్తూ.. హిందూపురం పోలీసులకు చిక్కాడు.

హిందూపురంలోని ఓ లాడ్జిలో యువతి పైన అత్యాచారయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు చిక్కుముడిని పోలీసులు విప్పారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిందితుడు రామకృష్ణ షాకింగ్ అంశాలు వెల్లడించాడు.

తల్లితో అక్రమ సంబంధాన్ని కొనసాగించిన రామకృష్ణ ఆమె కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాలని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 15న తల్లితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో పెనుగులాటలో తల్లి మృతి చెందింది. 4రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ హత్య ఉదంతం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

Girl abused at Hindupur Lodge before her Mother murdered

సీకేపల్లికి చెందిన మహబూబ్‌బీ (45) మహమ్మద్‌ను వివాహం చేసుకుంది. వీరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం మహమ్మద్‌ చనిపోయాడు. అప్పటి నుంచి మహబూబ్‌బీ కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కుమార్తె నగరంలో ఇంటర్మీయట్‌ చదువుతోంది. రెండో కుమార్తె బత్తలపల్లి కస్తూరిబా బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

పది రోజుల క్రితం మహబూబ్‌బీ శారదనగర్‌ నుంచి అశోక్‌నగర్‌కు మారింది. మహబూబ్‌బీ భర్త మృతి చెందిన తర్వాత యల్లనూరు మండలంలోని కూచివారిపల్లికి చెందిన రామకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మహబూబ్‌బీ కుమార్తెపై కన్నేసి ఆమెను పెళ్లిచేసుకుంటానన్నాడు.

ఇందుకు ఆమె వద్దని చెప్పింది. ఇంటిలో ఎవరూలేని సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో రామకృష్ణ పక్కనున్న రోకలిబండతో మహబూబ్‌బీ తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడి నుంచి రామకృష్ణ వెళ్లిపోయాడు.

పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి మీ అమ్మ అనారోగ్యానికి గురైందని, బెంగళూరు రావాలని చెప్పాడు. ఆమెను తీసుకొని బెంగళూరుకు బయలుదేరాడు. ఇద్దరు కలసి బెంగళూరుకు వెళ్లి అక్కడ మహబూబ్‌బీ లేదని వెనుదిరిగారు. చీకటిపడటంతో హిందూపురంలో బస్సు దిగి లాడ్జికి వెళ్లారు. లాడ్జిలో ఏం జరిగిందో తెలియదు.

రామకృష్ణ, ఆ యువతి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఆ యువతిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బహుశా చనిపోయిందని భావించి లాడ్జి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చూసిన లాడ్జి నిర్వాహకులు అత్యాచారానికి గురైందని భావించారు. కాగా, అతను కష్టాల్లో ఉన్న మహబూబ్‌బీకి రుణం ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+